📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: America: EAD ఆటోమేటిక్ పొడిగింపు రద్దు చేసిన అమెరికా

Author Icon By Aanusha
Updated: October 30, 2025 • 8:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) లో పని చేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌కి ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)ల ఆటోమేటిక్ పొడిగింపు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, ఈ నిర్ణయం అక్టోబర్ 30, 2025 నుండి అమల్లోకి రానుంది. దీని ప్రభావం అమెరికా (America) లోని భారతీయ వలస ఉద్యోగులపై తీవ్రంగా పడనుంది.

Read Also: Hurricane Melissa : కరీబియన్ దీవుల్లో మెలిస్సా తుఫాను విధ్వంసం .. 40 మంది మృతి!

హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈరోజు లేదా ఆ తర్వాత ఈఏడీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇకపై ఆటోమేటిక్ పొడిగింపు లభించదు. అయితే, ఈ తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న వారి పొడిగింపులపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.

గతంలో బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం, వలస ఉద్యోగులు తమ ఈఏడీ గడువు ముగిసినప్పటికీ, రెన్యువల్ కోసం సకాలంలో దరఖాస్తు చేసుకుంటే 540 రోజుల పాటు పనిచేసుకునేందుకు అవకాశం ఉండేది.

America

ఈ మార్పులు చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది

ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికారు.జాతీయ భద్రత, ప్రజా రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తెలిపింది. వలస ఉద్యోగుల నేపథ్యాన్ని తరచుగా సమీక్షించడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని, దేశ భద్రతకు హాని కలిగించే వారిని గుర్తించడం సులభమవుతుందని పేర్కొంది.

ఈ కొత్త నిబంధనను “కామన్ సెన్స్” చర్యగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో అభివర్ణించారు. “అమెరికాలో పనిచేయడం అనేది ఒక హక్కు కాదు, అదొక ప్రివిలేజ్ (ప్రత్యేక అవకాశం)” అని ఆయన స్పష్టం చేశారు.ఉద్యోగ అనుమతిలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు,

దరఖాస్తు చేయడంలో ఎంత ఆలస్యం చేస్తే

ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్‌సీఐఎస్‌ సూచించింది. దరఖాస్తు చేయడంలో ఎంత ఆలస్యం చేస్తే, అంతరాయం ఏర్పడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.సాధారణంగా అమెరికాలో నిర్దిష్ట కాలంపాటు పనిచేయడానికి అనుమతి ఉందని నిరూపించుకోవడానికి ఈఏడీ అవసరం.

అయితే, పర్మినెంట్ రెసిడెంట్లు (గ్రీన్ కార్డ్ హోల్డర్లు), అలాగే హెచ్-1బీ, ఎల్-1బీ వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న వారికి ఈ డాక్యుమెంట్ నుంచి మినహాయింపు ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Breaking News EAD Policy Indian Employees latest news Telugu News Trump administration US Immigration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.