📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : BLA – బలూచ్‌ ఆర్మీని ఉగ్రసంస్థగా ప్రకటించాలన్న పాక్‌-చైనా అభ్యర్థనను అడ్డుకున్న అగ్రరాజ్యం

Author Icon By Sudha
Updated: September 19, 2025 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాయాది పాకిస్థాన్‌ కు అగ్రరాజ్యం అమెరికా (America) షాకిచ్చింది. బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (Balochistan Liberation Army), దానికి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ ని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలంటూ యూఎన్‌ భద్రతామండలిలో చైనా,పాక్‌ చేసిన అభ్యర్థనను అమెరికా అడ్డుకుంది. బలూచ్‌ ఆర్మీ, మజీద్‌ బ్రిగేడ్‌పై ఆంక్షలు విధించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్‌-చైనా ఉమ్మడి బిడ్‌ను సమర్పించాయి. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ శాశ్వత ప్రతినిధి అసిమ్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. అల్‌ ఖైదా, తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌, బలోచ్‌ ఆర్మీ(Balochistan Liberation Army), మజీద్‌ బ్రిగేడ్‌ సహా పలు ఉగ్రవాద గ్రూపులు ఆఫ్ఘనిస్థాన్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాదం పాక్‌ ప్రాథమిక జాతీయ భద్రతకు ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభ్యర్థన మేరకు ఆ ఉగ్రసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, పాక్‌-చైనా చేసిన ఈ అభ్యర్థనను యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌ అడ్డుకున్నాయి. ఈ గ్రూపులను ఉగ్ర సంస్థలుగా గుర్తించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నాయి.

BLA – బలూచ్‌ ఆర్మీని ఉగ్రసంస్థగా ప్రకటించాలన్న పాక్‌-చైనా అభ్యర్థనను అడ్డుకున్న అగ్రరాజ్యం

కాగా, పాకిస్థాన్‌ ఆర్మీ ఫీల్డ్‌ మార్షల్‌ సయ్యద్‌ అసిం మునీర్‌ పర్యటన వేళ.. బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (Balochistan Liberation Army), దానికి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీఎల్‌ఏని 2019లోనే.. ‘స్పెషల్లీ డెజిగ్నేటెడ్‌ గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ (ఎస్‌డీజీటీ)’ జాబితాలో చేర్చిన అమెరికా.. మజీద్‌ బ్రిగేడ్‌ను కూడా బీఎల్‌ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూఎస్‌ విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతనెల కీలక ప్రకటన చేశారు. ఇటీవలే కాలంలో బీఎల్‌ఏకు చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ పాక్‌లోని పలు ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పాక్‌ సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తోంది. 2024లో కరాచీ ఎయిర్‌పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై బీఎల్‌ఏ దాడులు చేపట్టింది. ఇక ఈ ఏడాది అంటే 2025లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ హైజాక్ చేసి దాదాపు 300 మంది ప్యాసింజర్లను బందీలుగా చేసుకుంది. పాక్‌ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి వారిని విడిపించింది. ఈ రైలు హైజాక్‌ ఘటనలో 31 మంది పౌరులు, పాక్‌ సైనికులు చనిపోయారు. ఇలా వరుస దాడులతో బలూచ్‌ ఆర్మీని ఉగ్రసంస్థగా గుర్తించాలని పాక్‌ కోరుతూ వస్తోంది.

బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించబడిందా?

బలూచ్ జాతీయవాద నాయకులు పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు, ఈ ప్రాంతంలో దశాబ్దాల హింస, బలవంతపు అదృశ్యాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలను ఉదహరించారు.

బలూచిస్తాన్‌ను ఏ దేశం నియంత్రిస్తుంది?

బలూచిస్తాన్ ప్రాంతం పరిపాలనాపరంగా మూడు దేశాలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ మధ్య విభజించబడింది. విస్తీర్ణం మరియు జనాభా పరంగా అత్యధిక భాగం పాకిస్తాన్‌లో ఉంది, దీని అతిపెద్ద ప్రావిన్స్ (భూభాగంలో) బలూచిస్తాన్. పాకిస్తాన్ జనాభాలో 6.9 మిలియన్లు బలూచ్ అని అంచనా.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pakistans-false-propaganda-revealed-once-again/international/550373/

Balochistan Liberation Army Breaking News china latest news Pakistan Telugu News UN Security Council US veto

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.