అగ్రరాజ్యం అమెరికాపై రష్యా విమర్శలు గుప్పించింది. చౌకగా లభించే రష్యా చమురును కొనుగోలు చేయకుండా భారత్, ఇతర మిత్ర దేశాలను నిరోధించే ప్రయత్నాలను అమెరికా చేస్తోందని మండిపడింది. అలాగే అధిక ధరలకు యూఎస్ ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేయాలని భారత్, ఇతర దేశాలను అమెరికా బలవంతం చేస్తోందని విమర్శించింది. ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. గతేడాది అలాస్కాలో జరిగిన శాంతి చర్చలు, సుంకాలు, ఆంక్షలు వంటి బలవంతపు చర్యలను ఉపయోగిస్తూ అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకుందో కూడా రష్యా(Russiah) విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergey Lavrov) వివరించారు. “ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించాలని యూఎస్ మాకు చెబుతోంది. ఆ ప్రతిపాదనను మేము అంగీకరించాం. అమెరికా వైఖరి మాకు చాలా ముఖ్యం. యూఎస్ ప్రతిపాదనను అంగీకరించి మేము ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించే దిశగా వెళ్లాం. అయితే వాస్తవికత దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. సముద్ర చట్టంపై యూఎన్ కన్వెన్షన్‌ను ఉల్లంఘించింది. బహిరంగ సముద్రంలో ట్యాంకర్లపై యుద్ధం జరుగుతోంది.” అని సెర్గీ లావ్రోవ్ తెలిపారు.
Read Also: SP Ajitha Vejendla: నెల్లూరులో పోలీసుల మెరుపు తనిఖీలు
ఆర్థిక ఆధిపత్యం సాధించడాన్ని అమెరికా లక్ష్యంగా..
“భారత్ సహా మా మిత్రదేశాలను చౌకగా లభించే రష్యా చమురును కొనుగోలు చేయకుండా అమెరికా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. అధిక ధరలకు యూఎస్ ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేసేలా వారిని ఒత్తిడి చేస్తున్నారు. ఆర్థిక ఆధిపత్యం సాధించడాన్ని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రముఖ దేశాలకు రష్యా ఇంధన వనరులు వెళ్లే మార్గాలను అమెరికా నియంత్రించేందుకు యత్నిస్తోంది. ఈ చర్యలు న్యాయమైన పోటీకి విరుద్ధం. భారత్, చైనా, ఇండోనేసియా, బ్రెజిల్ లాగా అమెరికా వంటి ప్రధాన శక్తులతో సహా అన్ని దేశాలతో మనం మంచి సంబంధాలను ఏర్పరుచుకోవాలి. అమెరికా చేపడుతున్న చర్యలను పరిగణలోకి తీసుకోవాలి” అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ రష్యా నుంచి చమురు దిగుమతులను ఇండియా తగ్గించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా సైతం వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్ క్లారిటీ ఇచ్చింది. ముడి చమురు కొనుగోళ్ల విషయంలో జాతీయ ప్రయోజనాలకే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: