📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Tariffs Effect: ట్రంప్ టారీఫ్స్ తో చేతులెత్తేసిన అమెరికా బడా కంపెనీలు

Author Icon By Vanipushpa
Updated: August 8, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా(Russia) నుంచి చమురు దిగుమతి చేసుకుంటే యుద్ధానికి సహాయం చేస్తున్నారు అనే నెపంతో భారత్(India) మీద 50 శాతం సుంకాలను విధించింది అమెరికా. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) తేల్చి చెప్పేశారు. ఈ నెల 27 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఇది జరిగి రెండు రోజులు అవుతోంది. అయితే ఈ టారీఫ్ ఎఫెక్ట్ అప్పుడే మార్కెట్ల మీద పడింది. ట్రంప్ పెంచిన సుంకాల కారణంగా అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి(Trump Tariffs On India). దీంతో అమెరికా ప్రజలపై భారం పెరగనుంది.

Tariffs Effect: ట్రంప్ టారీఫ్స్ తో చేతులెత్తేసిన అమెరికా బడా కంపెనీలు

పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారం
ట్రంప్ విధించిన అదనపు సుంకాల వలన ప్రభావితమయ్యే వస్తువుల్లో దుస్తులు ఒకటి. భారతదేశ వస్త్ర పరిశ్రమను ఈ సుంకాలు గట్టిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికాకు మన దేశం నుంచి ఏటా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన రెడీమేడ్ దుస్తులు ఎగుమతి అవుతాయి. భారత వస్త్రాలు, దుస్తులకు యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం . మార్చి 2025 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో మన దేశం 28 శాతం వాటాను కలిగి ఉంది. దీని మొత్తం విలువ $36.61 బిలియన్లు. ఇప్పుడు భారత్‌పై ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ సుంకాలు పడుతున్నాయి.
టారీఫ్ ల భయంలో బడా కంపెనీలు..భారత వస్త్ర పరిశ్రమపై దెబ్బ
అనుకున్నట్టుగానే భారత వస్త్ర పరిశ్రమ మీద అప్పుడే దెబ్బ పడింది. ట్రంప్ విధించిన టారీఫ్(Trump Tariffs) ల భయంతో దిగుమతులకు ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తుందని అక్కడి బడా కంపెనీలు భయపడుతున్నాయి. దీని కారణంగా స్టాక్ పంపించొద్దు అంటూ వాల్ మార్ట్, అమెజాన్, గ్యాప్, టార్గెల్ లాంటి పెద్ద కంపెనీలు భారత్‌ నుంచి స్టాక్‌ పంపించొద్దని టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్‌ పెడుతున్నారు. తదుపరి నోటీసులు వచ్చేవరకూ సరుకులను నిలిపివేయాలని చెప్పారు. కొనుగోలుదారులు ఖర్చు భారాన్ని పంచుకోవడానికి ఇష్టపడటం లేదని కంపెనీలు చెబుతున్నాయి.

సుంకాలు వ్యాపారాలను ఎలా ప్రభావితం చేస్తాయి?
సమాఖ్య ప్రభుత్వం వసూలు చేసే దిగుమతులపై పన్నులు అయిన సుంకాలు సాధారణంగా ఖర్చులను పెంచుతాయి, అయితే ఆ పెరిగిన ధరల భారాన్ని వ్యాపారాలు లేదా వినియోగదారులు చివరికి భరిస్తారా అనే దానిపై ఆర్థికవేత్తలలో కొంత చర్చ జరుగుతోంది.

సుంకాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయా?
సుంకాలు ధరలను పెంచవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ దీనికి అంగీకరించడం లేదు: గురువారం ముందు ఇప్పటికే అమలులో ఉన్న సుంకాల కారణంగా ద్రవ్యోల్బణం నెమ్మదిగా పెరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/train-accident-fire-in-moving-train-nellore-passengers-safe/andhra-pradesh/527720/

Corporate exit economic policy Global Trade Telugu News Trade War Trump tariffs US companies impact US Economy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.