📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: US: షట్ డౌన్ సంక్షోభంలో విమానయాన రంగం.. వందలాది విమానాలు రద్దు

Author Icon By Rajitha
Updated: November 7, 2025 • 1:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

US: అమెరికాలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశానికే పెద్ద తలనొప్పిగా మారింది. ఆర్థిక రంగాలు కుదేలవుతున్నాయి. ప్రపంచ దేశాలకు అధిక టారిఫ్ లతో అక్కడి కంపెనీలు సిబ్బందికి జీతాలు సరిగ్గా ఇచ్చుకోలేని స్థితి ఏర్పడింది. దీంతో పలు కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. తాజాగా షట్ డౌన్ (shutdowns) ప్రభావం విమానయాన రంగంపై పడింది. ఈ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరగడంతో దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రీ షెడ్యూల్ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read also: Donations 2025: శివ్ నాడార్ కుటుంబం దేశంలో అగ్ర దాతలు

US: షట్ డౌన్ తో సంక్షోభంలో విమానయాన రంగం వందలాది విమానాలు రద్దు

జీతాలు అందక సిబ్బంది ఇబ్బందులు

US: ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విమాన సర్వీసులను 10శాతం వరకు తగ్గించాలని నిర్ణయం భద్రతా కారణాల దృష్ట్యా దేశంలోని రద్దీ ఎక్కువగా ఉండే 40 ప్రాంతాల్లో విమాన సర్వీసులను 10శాతం వరకు తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎ) విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటికి 750కి పైగా విమాన సర్వీసులను ముందుగానే రద్దు చేసినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించింది. ప్రముఖ విమానయాన సంస్థ అమెరికన్ఎ యిర్ లైన్స్ రోజుకు 220 విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా, డెల్టా ఎయిర్ లైన్స్ శుక్రవారం 170 సర్వీసులను, సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ వంద సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపాయి. జీతాలు అందక సిబ్బంది ఇబ్బందులు ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది సహా వేలాదిమంది కీలక ఉద్యోగులకు జీతాలు అందడం లేదు.

ప్రయాణాల రద్దీ మరింత పెరగనుంది.

దీంతో సిబ్బంది కొరత ఏర్పడింది. చాలామంది అనారోగ్య కారణాలతో సెలవులు పెడుతుండటంతో ఏటీసీ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే గురువారం 6,400కు పైగా విమానాలు ఆలస్యంగా నడవగా, 200 సర్వీసులు రద్దయ్యాయి. బోస్టన్, నెవార్క్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు రెండు గంటలకు పైగా, షికాగో, వాషింగ్టన్ ఎయిర్పోర్టుల్లో గంటకుపైగా వేచి చూడాల్సి వచ్చింది. రానున్న దినాల్లో ప్రయాణాల రద్దీ మరికొన్ని వారాల్లో ‘థ్యాంక్స్ గివింగ్’ సెలవులు రానున్న నేపథ్యంలో ప్రయాణాల రద్దీ మరింత పెరగనుంది. ఈ సమయంలో విమానాల రద్దు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయనుంది. అట్లాంటా, డెన్వర్, చికాగో, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్ వంటి ప్రధాన విమానాశ్రయాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విమాన ప్రయాణాలు సురక్షితమేనని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

aviation flights latest news shutdown Telugu News us

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.