ఇరాన్ (Iran) న్యూక్లియర్ సైట్లపై అమెరికా జరిపిన వైమానిక దాడులను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఐక్యరాజ్య సమితి చట్టాలను అమెరికా ఉల్లంఘిస్తోందని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లపై దాడులు జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించగానే, చైనా (China) వైఖరి స్పష్టమైంది. మీడియా ప్రశ్నలకు స్పందించిన చైనా అధికార ప్రతినిధి, అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు.అమెరికా ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఇది మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులను మరింత దిగజారుస్తుంది. ఇలాంటి దాడులు శాంతిని దెబ్బతీయడం తప్ప మరొకటి కావు, అని చైనా అభిప్రాయపడ్డది.
యుద్ధానికి వ్యతిరేకంగా చైనా ప్రకటన
చైనా ప్రతినిధి మాట్లాడుతూ, యుద్ధంలో పాల్గొంటున్న దేశాలన్నీ ఒక్కసారి ఆలోచించాలి. మానవత్వం నిలబెట్టాలి. చైనా ఎప్పుడూ శాంతికే మద్దతు ఇస్తుంది. మిడిల్ ఈస్ట్‌లో స్థిరత్వం కోసం అన్ని దేశాలతో కలిసి పని చేస్తుంది, అని తెలిపారు.చైనా కన్నా ముందు పాకిస్తాన్ కూడా ఈ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ, ఇరాన్‌పై జరిగే పరిణామాలు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే మిడిల్ ఈస్ట్‌లో విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి, అన్నారు.
ఇరాన్‌కు రక్షణ హక్కు ఉందని పాకిస్తాన్ స్పష్టం
పాకిస్తాన్ మంత్రి వెల్లడించినదాని ప్రకారం, యూఎన్ ఛార్టర్ ప్రకారం ఇరాన్‌కి తనను తాను రక్షించుకునే హక్కు ఉంది. ఇలాంటి దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉండే అవకాశముందని ఆయన హెచ్చరించారు.ఈ పరిణామాల మధ్య చైనా, పాకిస్తాన్ ప్రకటించిన శాంతి సందేశం చాలా ముఖ్యంగా మారింది. యుద్ధానికి భిన్నంగా, సంయమనం పాటించాలని కోరుతూ ఈ దేశాలు మాట్లాడుతున్నాయి. ఇది మిడిల్ ఈస్ట్‌లో భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.
Read Also : Iran – Israel War : ఆయిల్ కారిడార్ పై ఇరాన్ కీలక నిర్ణయం..