US airstrike Syria : గత నెలలో సిరియాలో ముగ్గురు అమెరికన్ల హత్యకు ప్రతీకారంగా అమెరికా మరో కీలక దాడి చేపట్టింది. వాయవ్య సిరియాలో జరిగిన వైమానిక దాడిలో కీలక ఉగ్రవాద నేత బిలాల్ హసన్ అల్-జాసిమ్ హతమైనట్లు అమెరికా సైన్యం ధ్రువీకరించింది. ఈ దాడి జనవరి 16న నిర్వహించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
సెంట్‌కామ్ ప్రకారం, అల్-జాసిమ్ అల్-ఖైదా అనుబంధ ఉగ్రసంస్థతో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, గత డిసెంబర్‌లో పాల్మైరా ప్రాంతంలో జరిగిన దాడికి పరోక్షంగా బాధ్యుడిగా ఉన్నాడు. ఆ ఘటనలో ఇద్దరు అమెరికన్ సైనికులు, ఒక అమెరికన్ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అమెరికా జరిపిన మూడో దాడి ఇదేనని అధికారులు తెలిపారు.
Read also: Municipal Elections: తెలంగాణలో మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు
ఈ సందర్భంగా అమెరికా రక్షణ శాఖ తీవ్ర హెచ్చరిక (US airstrike Syria) చేసింది. అమెరికన్లపై దాడులు చేసిన వారిని ఎక్కడ ఉన్నా వెంబడించి శిక్షిస్తామని స్పష్టం చేసింది. సిరియాలో ఐసిస్ స్థావరాలపై దాడులు కొనసాగుతాయని, ఉగ్రవాదులకు ఎలాంటి సురక్షిత ఆశ్రయం ఉండదని అమెరికా స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: