📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Soup-మద్యం మత్తులో సూప్‌‌లో మూత్రం .. ‘రూ. 2.64 కోట్ల’ జరిమానా

Author Icon By Vanipushpa
Updated: September 16, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా(China)లోని హాట్‌పాట్ రెస్టారెంట్‌లోని ఒక సూప్(Soup) పాత్రలో ఇద్దరు టీనేజర్లు మూత్ర విసర్జన చేసినందుకు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2.2 మిలియన్ యువాన్లను (సుమారు 2.64 కోట్ల రూపాయలు) రెండు కేటరింగ్ కంపెనీలకు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో షాంఘైలోని హైడిలావ్ బ్రాంచ్‌ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. హైడిలావ్ చైనాలో అతి పెద్ద హాట్‌పాట్ రెస్టారెంట్ల(Restaurant) చైన్. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు 17 ఏళ్ల కుర్రాళ్లు షాంఘైలోని హైడిలావ్ బ్రాంచ్‌లో ఒక సూప్ పాత్రలో మూత్ర విసర్జన చేసి, ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కలుషితమైన ఈ సూప్‌ను ఎవరూ తినలేదనే సమాచారం ఉన్నప్పటికీ, తమ హోటల్‌కు వచ్చిన వేలాది ఖాతాదారులకు కొన్ని రోజులపాటు పరిహారం చెల్లించామని హైడిలావ్ ప్రకటించింది. గత శుక్రవారం షాంఘై కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. హైడిలావ్ రెస్టారెంట్‌లో సూప్‌లో మూత్రం పోసిన టీనేజర్లు కంపెనీల ఆస్తి హక్కులు, ప్రతిష్ఠను దెబ్బతీశారని పేర్కొంది. ఈ ఘటనలో వాడిన టేబుల్‌వేర్ కలుషితమైందని, ప్రజల్లో తీవ్ర అసహ్యాన్ని కలిగించిందని కోర్టు గుర్తించింది.

Soup-మద్యం మత్తులో సూప్‌‌లో మూత్రం .. ‘రూ. 2.64 కోట్ల’ జరిమానా

పరిహారం మొత్తాన్ని తల్లిదండ్రులే చెల్లించాలి

అదే సమయంలో, టీనేజర్ల తల్లిదండ్రులు తమ పెంపక బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల పరిహారం మొత్తాన్ని తల్లిదండ్రులే చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది. కార్యనిర్వాహక ఖర్చులు, రెస్టారెంట్ ప్రతిష్ఠ దెబ్బతిన్నందుకు గానూ 2 మిలియన్ యువాన్లు (దాదాపు 2.4 కోట్ల రూపాయలు)… టేబుల్‌వేర్ నష్టం, శుభ్రపరిచే ఖర్చులకు ఒక కేటరింగ్ కంపెనీకి 1.3 లక్షల యువాన్లు (సుమారు 16 లక్షల రూపాయలు).. కోర్టు ఖర్చులకు 70,000 యువాన్లు చెల్లించాలి (సుమారు 8.50 లక్షల రూపాయలు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే, హైడిలావ్ తమ కస్టమర్లకు అదనంగా చెల్లించిన పరిహారం “స్వచ్ఛంద వ్యాపార నిర్ణయం” కింద పరిగణిస్తున్నామని, దాన్ని టీనేజర్లపై మోపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు ఆ బ్రాంచ్‌కు వచ్చిన నాలుగువేల మందికి పైగా కస్టమర్లకు హైడిలావ్ పూర్తి రీఫండ్‌తో పాటు, బిల్లుఅయిన మొత్తానికి 10 రెట్లు ఎక్కువగా నగదును పరిహారం ఇచ్చింది. దీంతోపాటు, మొత్తం హాట్‌పాట్ పరికరాలను మార్చి, డిస్‌ఇన్ఫెక్షన్ చర్యలు చేపట్టింది. హైడిలావ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది.

సూప్ గురించి 5 వాస్తవాలు ఏమిటి?
సూప్‌లను వేడిగా లేదా చల్లగా తినవచ్చు, అది వడ్డించే ప్రాంతం యొక్క వాతావరణాన్ని బట్టి ఉంటుంది మరియు రుచులు తీపిగా లేదా రుచికరంగా ఉండవచ్చు.

సూప్ యొక్క పూర్తి రూపం ఏమిటి?
SOUP అనే సంక్షిప్త పదానికి అత్యంత సాధారణ "పూర్తి రూపం" అనేది సాఫ్ట్‌వేర్ ఆఫ్ అన్‌నోన్ ప్రోవెన్స్ లేదా సాఫ్ట్‌వేర్ ఆఫ్ అన్‌నోన్ పెడిగ్రీ.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/america-nagamallaiahs-murder-what-are-they-saying/international/548343/

Drunken Misconduct Google news Latest News in Telugu Public Outrage Restaurant Scandal Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.