📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Upendra Dwivedi : పాక్‌కు మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన ఆర్మీ చీఫ్‌

Author Icon By Sudha
Updated: November 17, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాయాది పాకిస్థాన్‌ కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం 88 గంటల ట్రైలర్‌ మాత్రమేనని అన్నారు. దాయాది ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ 88 గంటల్లో ముగిసిన ట్రైలర్‌ మాత్రమే. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకైనా మేం సిద్ధంగా ఉన్నాం. పాక్‌ అవకాశం ఇస్తే.. పొరుగుదేశంతో బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో దాయాదికి మేము నేర్పిస్తాము’ అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు.

Read Also : http://Delhi Blast: కారు బాంబు పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు

Upendra Dwivedi

భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల శ్రేయస్సు, పురోగతిపై దృష్టి పెడుతుందని జనరల్‌ ద్వివేది తెలిపారు. తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే.. దీటుగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలతో చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దాయాది పాక్‌కు జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టిగా హెచ్చరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Army Chief Breaking News India military latest news National Security Pakistan Warning Telugu News Upendra Dwivedi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.