📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Telugu News: UNSC: జమ్మూకాశ్మీర్, లడఖ్ భారత్ లో అంతర్భాగాలు: హరీష్

Author Icon By Sushmitha
Updated: December 16, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిత్యం భారతదేశంపై ఏదో ఒక నింద వేయడం, లేదా తక్కువ చేసి మాట్లాడం, అసత్యప్రచారాలు చేయడం పాకిస్తాన్ కు వెన్నెతో పెట్టిన విద్య. తాజాగా పాకిస్తాన్ (Pakistan) ప్రస్తావించిన అంశాలపై భారత్ తిప్పికొట్టింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ‘శాంతి కోసం నాయకత్వం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బహిరంగ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ అనవసర విషయాలు ప్రస్తావించింది. జమ్మూకాశ్మీర్, సింధు జలాలపై నోరుపారేసుకుంది. దీన్ని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Read Also: Thailand: యుద్ధం ముగింపు దిశగా రష్యా-ఉక్రెయిన్ అడుగులు

UNSC Jammu and Kashmir, Ladakh are integral parts of India: Harish

అవి భారత్ లో అంతర్భాగాలు లో జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం అని అవి విడదీయరాని భాగం అని మరోసారి స్పష్టం చేశారు. అవి ఉన్నాయి.. ఉంటాయి.. ఎల్లప్పుడూ ఉంటాయి అని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) జైల్లో పెట్టారని..అసిమ్ మునీర్ ను మాత్రం అందలం ఎక్కించారని జీవితాంతం రోగనిరోధక శక్తిగా పెంచిపోషిస్తున్నారని వ్యాఖ్యానించారు.

సింధు జాలాల ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసింది?

సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎందుకు రద్దు చేసిందో వివరిస్తూ.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా మారిందని అభివర్ణించారు. 65 సంవత్సరాల క్రితం భారతదేశం మంచి విశ్వాసంతో, మంచి సంకల్పం, స్నేహ స్పూర్తితో సింధుజలాల ఒప్పందంలోకి ప్రవేశించిందన్నారు. కానీ ఈ ఆరున్నర దశాబ్దాల్లో భారతదేశంపై పాకిస్తాన్ మూడుయుద్ధాలు, వేలాది ఉగ్రవాద దాడులను ప్రేరేపించి ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆయన గుర్తు చేశారు.

పహల్గామ్ దాడిలో ఒక విదేశీయుడితో పాటు 26మంది మరణించారని హరీష్ గుర్తు చేశారు. అందుకే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ముగించేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపి వేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ పాకిస్తాన్ పహల్గాంపై ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ సాక్షాధారాలతో నిరూపించేసరికి తోకముడిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Harish Parvathaneni statement India at United Nations India's stance on Kashmir Indian Diplomacy Jammu Kashmir sovereignty Ladakh geopolitical news Ladakh integral part of India Latest News in Telugu Telugu News Today UN Security Council meeting UNSC Jammu Kashmir

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.