📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: UNO: జైశంకర్ ఘాటు హెచ్చరిక – ఉగ్రవాదం ప్రోత్సహించే దేశాలపై ఫైర్

Author Icon By Pooja
Updated: September 28, 2025 • 10:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో స్పందించారు. పేరు ప్రస్తావించకపోయినా, పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ, కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ఫ్యాక్టరీల్లా(factory) నడుపుతున్నాయని, ఇది ప్రపంచ శాంతి భద్రతలకు అతిపెద్ద ప్రమాదమని అన్నారు.

Read also: Karur stampede: తొక్కిసలాట.. విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?.. సీఎం స్టాలిన్ ఏమన్నారంటే..!
జైశంకర్ వ్యాఖ్యానిస్తూ, ప్రపంచ దేశాలు ఉగ్రవాద నిర్మూలన(Eradication of terrorism) కోసం కృషి చేస్తున్నప్పటికీ, కొందరు మాత్రం దానిని తమ విదేశాంగ విధానంగా మలుచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి అండగా నిలిచే దేశాలను అంతర్జాతీయ వేదికపై ఒంటరిని చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఉగ్రవాద కేంద్రాలు – పరిశ్రమల్లా మారుతున్నాయి

ఉగ్రవాదం ఒక ప్రాంతానికి పరిమితం కాదని, ఇది మొత్తం ప్రపంచానికి సవాలు విసురుతోందని జైశంకర్ తెలిపారు. “ఉగ్రవాద శిబిరాలు ఇక శిబిరాలు మాత్రమే కాదు, అవి ఒక పరిశ్రమలా వ్యవస్థీకృతంగా నడుస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఇవి అంతర్జాతీయ సమాజానికి తక్షణ ముప్పుగా ఉన్నాయని హెచ్చరించారు.

ఐరాస భద్రతా మండలి సంస్కరణల అవసరం

ఈ సందర్భంగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు తప్పనిసరి అని జైశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుత గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవాలంటే, భద్రతా మండలిని విస్తరించడం ద్వారా మాత్రమే ఐరాస సమర్థవంతంగా పని చేయగలదని ఆయన భారత్ తరఫున స్పష్టం చేశారు.

జైశంకర్ ఎక్కడ ప్రసంగించారు?
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు.

ఆయన ఎవరి గురించి వ్యాఖ్యలు చేశారు?
పేరు ప్రస్తావించకపోయినా, పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Google News in Telugu India Foreign Minister Latest News in Telugu Pakistan Terrorism S Jaishankar Telugu News Today UNGA speech united nations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.