📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: UNO: మండలిలో పాక్ పై భారత్ తీవ్ర ఆరోపణలు

Author Icon By Pooja
Updated: September 24, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ తన సొంత ప్రజలనే బలితీసుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి మావన హక్కుల మండలి (యుఎన్హెచారి) వేదికగా భారత్ ధ్వజమెత్తింది. పాక్ తన సొంతగడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, వారికి నిధులను, ఆయుధాలను(Weapons) సమకూరుస్తున్నదని, తద్వారా ఖైబర్ ఫఖ్తూన్వా ప్రావిన్స్ లోని సొంత ప్రజలపై పాకిస్తాన్ బాంబులు వేసిందని గుర్తు చేసింది. పాకిస్తాన్ వాయుసేన చేసిన ఈ దాడిలో 30మంది పాకిస్తానీ పౌరులు ప్రాణాలు కోల్పోయారని మనదేశం ఆరోపించింది.

అంతేకాక మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పింది. ఐక్యరాజ్యసమితి మావన హక్కుల మండలి 60వ సదస్సులో భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ పాకిస్తాన్ తన సొంత ప్రజలనే దారుణంగా హింసిస్తున్నదని భారత్ ఆరోపించింది. అంతేకాక అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ భారత్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని దీన్ని తక్షణమే ఆపాలని క్షితిజ్ త్యాగి సూచించారు. సొంత ప్రజలనే రక్షించుకోలేని పాక్ భారత్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొంది.

పాక్ సైనికులు, పౌరులను హతమార్చిన ఉగ్రవాదులు

పాకిస్తాన్లోని ఖైబర్ పల్తూన్ ఖ్వాప్రావిన్స్ లో తాలిబన్ల సానుభూతిపరులైన తెహ్రీక్ ఏ తాలిబన్ (టీటీసి) ఉగ్రవాదుల యాక్టివిటీ జరుగుతోంది. గతంలో పలుమార్లు ఈ టెర్రరిస్టులు(Terrorists) చేసిన భీకర దాడుల్లో చాలామంది పాక్ సైనికులు, పౌరులు మరణించారు. టీటీపీ ఉగ్రవాదులు భైబర్ పల్తూన్ ఖ్వా ప్రావిన్స్ లోని తీరా లోయలో ఉన్న మూత్రే దరా గ్రామంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దాచి ఉంచారనే సమాచారం పాక్ సైన్యానికి అందిందని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ సమాచారం ఆధారంగా సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తిరా లోయలో చైనాకు చెందిన జే-17 యుద్ధవిమానాల నుంచి పాక్ వాయుసే లేజర్ గైడెడ్ బాంబులను జారవిడిచింది. ఈ దాడిలో 30 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

మండిపడుతున్న గ్రామస్తులు పాక్ సైన్యంపై ఖైబర్ పల్తూన్ ఖ్వా ప్రావిన్స్ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉగ్రవాదం వల్ల తాము చాలా నష్టపోయామని, ఇప్పుడు సైన్యం కూడా తమపై దాడులు చేస్తోందని వాపోతున్నారు. ఆపరేషన్ సిందూర్ యుద్ధం అనంతరం పాక్ ఉగ్రవాద సంస్థలకు భారీగా నిధులను ఇస్తున్నదని, అలాగే సైన్యం కూడా నాశనమైన ఉగ్రవాద శిబిరాలను తిరిగి నిర్మించుకునేందుకు నిధులను సమకూరుస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం పాకిస్తాన్ సౌదీ అరేబియా మద్దతును తీసుకుంది. రెండుదేశాల మధ్య జరిగిన రక్షణ ఒప్పందంలో రెండుదేశాలపై ఏదేశం దాడిచేసిన అది తమపై జరిగినట్లుగా పరిగణించి, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవలే పాకిస్తాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఐక్యరాజ్యసమితి మండలిలో భారత్ ఏ ఆరోపణలు చేసింది?
భారత్, పాకిస్తాన్ ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తోందని మరియు అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండలిలో తీవ్ర ఆరోపణలు చేసింది.

భారత్ ఆరోపణలకు పాకిస్తాన్ ఎలా స్పందించింది?
పాకిస్తాన్ సాధారణంగా ఈ ఆరోపణలను ఖండిస్తూ, తిరిగి భారత్‌పై ఆరోపణలు చేయడం ఆనవాయితీగా చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu India Pakistan Relations Indian Diplomacy Terrorism united nations UNO

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.