📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

United States : వాషింగ్టన్ ను చుట్టుముట్టిన నేషనల్ గార్డ్..

Author Icon By Sai Kiran
Updated: August 14, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అట్టుడుకుతున్న రాజధాని

అమెరికా (United States) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. వలసవాదులపై ఉకుపాదాన్ని మోపారు. వీసాలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అక్రమ వలసవాదులను నిర్భందించి, ప్రత్యేక విమానాల్లో వారిని వెనక్కి పంపిన ఉదంతం మనకు తెలిసిందే. అంతేకాదు ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో విదేశీయులకు చదువుకునే అర్హత లేకుండా చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా సోషన్మీ డియాలో పోస్టులు పెడుతున్నవారిని అరెస్టు చేసి, వారిని తక్షణమే వారి స్వదేశాలకు పంపుతున్నారు ట్రంప్. దీంతో గత కొంతకాలంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రజలు రోడ్లపైకి వచ్చి, ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. దీనికి కారణం ట్రంప్ తీసుకుంటున్న చారిత్రక నిర్ణయాలే.

డీసీలో అత్యవసర పరిస్థితి

కాగా డీసీలో అత్యవసర పరిస్థితి నెలకుందని ట్రంప్ అంటున్నారు. అక్కడ నేరాలు ఎక్కువ అయిపోయాయని.. అందుకే నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దంపానని (United States) ట్రంప్ అంటున్నారు. దాంతోపాటూ పబ్లిక్ సేఫ్టీ ఎమెర్జెన్సీని ప్రకటించారు. నేరాలను అరికట్టేందుకు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఫెడరల్ఆ ధీనంలోకి తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే డీసీ మేయర్ మురియల్ బౌసర్ మాత్రం నేరాలు తగ్గుముఖం పట్టాయంటూ ప్రకటన చేయడం గమనార్హం. 2024లో హింసాత్మక నేరాలు 35 శాతం తగ్గాయి.

నిరాశ్రయులను బయటకు పంపిస్తా:

ట్రంప్ నేరాలను అరికట్టేందుకు అని చెబుతూనే వాషింగ్టన్ లో ఉన్న నిరాశ్రయులను కూడా బయటకు పంపించేస్తామని అంటున్నారు ట్రంప్ (Trump). వాషింగ్టన్లో దాదాపు 5,138 మంది నిరాశ్రయులైన పెద్దలు, పిల్లలు ఉన్నారు. వీరందరూ బయటకు వెళ్లిపోవాలని ట్రంప్ అంటున్నారు. కావాలంటే బయటకు ఒక ఇంటి స్థలమిస్తామని కానీ డీసీని మూత్రం వదిలి వెళ్లిపోవాలని చెబుతున్నారు. అయితే ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు లాంటి వివరాలు మాత్రం ఏం చెప్పడం లేదు. ఇది ఒకరకంగా పేదరికాన్ని నేరంగా చిత్రీకరించే ప్రయత్నం అని విమర్శకులు అంటున్నారు. అయితే ట్రంప్ మాత్రం ఇది వాషింగ్టన్కు స్వేచ్ఛాదినం తిరిగి మన రాజధానిని నేరరహితంగా మార్చబోతున్నాం అని చెప్పుకుంటున్నారు.

Breaking News in Telugu Google News in Telugu Telugu News online USARULES USARULESCHANGE USAtrump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.