బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింస, మైనార్టీ వ్యక్తిని కొట్టి చంపడంపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్(Antonio Guterres) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను ప్రభుత్వం కాపాడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళనలపై గుటెరస్ చేసిన కామెంట్స్‌ను ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియాకు వెల్లడించారు. ‘బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింస్మాతక ఘటనలపై మేం ఆందోళన చెందుతున్నాం. అంతేకాకుండా మైనార్టీలపై జరుగుతున్న దాడులు గురించి కూడా విన్నాం. బంగ్లాదేశ్ లేదా ఇతర ఏ దేశంలో అయినా సరే మైనార్టీలు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగి ఉండాలి. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను ప్రభుత్వం కాపాడుతుందని మేము విశ్వసిస్తున్నాం’ అని డుజారిక్ అన్నారు.
Read Also: H1-B: గ్రీన్‌కార్డుల ప్రక్రియలో గూగుల్ వేగం
మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ తీవ్ర దిగ్భ్రాంతి
హాదీ మృతిపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి : యూఎన్ మానవ హక్కుల కమిషనర్
మరోవైపు విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతీకారం, ప్రతిఘటన హింసను మరింత పెంచుతాయని అన్నారు. అవి విభేదాలను మరింత పెంచి, అందరి హక్కులను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. హాది హత్యకు కారణమైన దాడిపై త్వరిత, నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు జరిపించాలని తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి బంగ్లాదేశ్ అధికారులను కోరారు. ప్రతి ఒక్కరూ హింసకు దూరంగా ఉండి శాంతిని పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలు వేళ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అవసరమని వోల్కర్ టర్క్ అన్నారు. ప్రజలు భయం లేకుండా ప్రజాజీవితంలో పాల్గొనడానికి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచే వాతావరణం అత్యంత కీలకమని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: