ఇటీవల జరుగుతున్న ఘోర విమాన ప్రమాదాలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరవక ముందే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు తరచు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇటలీలోని బ్రెస్సియా (Brescia, Italy) నగరానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఒక చిన్న విమానం హైవేపై కూలడం. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడడం. చిన్న తరహా అల్ట్రాలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ (Ultralight aircraft) ఉన్నట్టుండి రోడ్డుపై కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి.
కంట్రోల్ కోల్పోయిన విమానం హైవేపై కుప్పకూలింది.. ఇద్దరు మృతి, బైకర్లకు గాయాలు
ఈ దుర్ఘటనలో విమానం పైలట్‌తో సహా ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విమానం నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామనుకున్న సమయంలో.. ఆ ఫ్లైట్ నోస్‌డైవ్ (Flight nosedive) చేసి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కిందకు డైవ్ చేసిన ఆ విమానం హైవేను ఢీకొట్టింది. ఫ్రేషియా ఆర్జీ అల్ట్రాలైట్ విమానాన్ని (Ultralight aircraft) కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. వింగ్ వెడల్పు 30 అడుగులు ఉంటుంది. చాలా వేగంగా రోడ్డును ఢీకొనడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. విమానం పేలిన సమయంలో ఇద్దరు బైకర్లు గాయపడ్డారు.
అల్ట్రాలైట్ విమానాన్ని ఎవరు కనుగొన్నారు?
ఈ రోజు అల్ట్రాలైట్ల పితామహుడిగా పరిగణించబడే మూడీ , ఇకారస్ II హ్యాంగ్ గ్లైడర్ మరియు రెండు-సైకిల్ మోటారును కలిపి, ఒక కొత్త రకమైన ఫ్లైయర్‌ను సృష్టించాడు, దీనిని అతను విస్కాన్సిన్‌లోని ఓష్కోష్‌లో జరిగిన ప్రయోగాత్మక విమాన సంఘం యొక్క ఫ్లై-ఇన్‌లో ప్రదర్శించాడు.
అల్ట్రాలైట్ కి మరో పేరు ఏమిటి?
“అల్ట్రాలైట్” మరియు ” మైక్రోలైట్ ” అనే పదాలు అనేక ఇతర దేశాలలో ప్రధానంగా వినోదం కోసం ఎగురుతున్న సింగిల్ మరియు 2-సీట్ల విమానాలను వివరించడానికి ఉపయోగించబడతాయి. ఈ పదాలలో పవర్డ్ అల్ట్రాలైట్లు (ఫిక్స్‌డ్ వింగ్, రోటర్‌క్రాఫ్ట్, పవర్డ్ పారాచూట్‌లు మొదలైనవి) ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: india-Maldives : రూ. 4,850 కోట్ల రుణం & చారిత్రక FTA 2025