📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Ukraine: రష్యాతో శాంతి ఒప్పందంపై జెలెన్ స్కీ కీలక ప్రకటన

Author Icon By Saritha
Updated: January 1, 2026 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మరికొన్ని రోజుల్లో సరిగ్గా నాలుగేళ్లు పూర్తిచేసుకుని, ఐదో సంవత్సరంలో అడుగుపెడుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి రాన్నది. (Ukraine) త్వరలో ప్రపంచదేశాలు సంతోషించే శాంతి ఒప్పందాలకు రెండుదేశాలు రానున్నాయి. ఇది శుభపరిణామమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలుగా చేస్తున్న ప్రయత్నాలు మొత్తానికి శుభం కార్డు పడనున్నది. ఈ పరిస్థితుల్లో రష్యాతో శాంతి ఒప్పందం 10శాతం దూరంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. నూతన సంవత్సర వేడుకల ప్రసంగంలో జెలెన్ స్కీ మాట్లాడారు. దేశం యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటోందని తెలిపారు. ఒక బలమైన భద్రతా హామీతో ఒప్పందం అవసరం అని పేర్కొన్నారు. డబ్బు కోసం కాదని.. రష్యా తిరిగి దాడి చేయకుండా నిరోధించే ఏ ఒప్పందానికైనా సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

Read also: NewYear: ప్రపంచ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో రద్దులు

makes a key statement on a peace agreement with Russia.

90శాతం ఒప్పందం పూర్తయింది

మిగిలిన 10శాతంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. మాస్కోకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదని హెచ్చరించారు. (Ukraine) ఉక్రెయిన్ లో దాదాపు 20శాతం రష్యా ఆక్రమించుకుందని.. ఇక ఒప్పందంలో దౌత్యవేత్తలు ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అది వదులుకునే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం 90 శాతం శాంతి ఒప్పందం పూర్తైందని.. మిగతా 10శాతం ఉక్రెయిన్ భవిష్యత్ ను, యూరప్ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని తెలిపారు.

28పాయింట్ల ప్రణాళిక

గత నాలుగేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సాగుతోంది. తాజాగా ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇరు దేశాధినేతలతో సమావేశం అయ్యారు. కానీ సత్ ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా మరోసారి 28 పాయింట్ల ప్రణాళికతో ముందుకు వచ్చారు. దీనికి రష్యా అంగీకారం తెలిపితే.. ఉక్రెయిన్ తిరస్కరించింది. ప్రస్తుతం అమెరికా రాయబారి స్టీవ్ విట్ కాఫ్, ట్రంప్ అల్లుడు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



Latest News in Telugu peace agreement Russia Ukraine Peace Talks Russia Ukraine War Telugu News Ukraine President Zelenskyy Zelenskyy Statement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.