📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Telugu News: Ukraine: భద్రతా హామీలు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం.. జెలెన్ స్కీ

Author Icon By Sushmitha
Updated: December 15, 2025 • 5:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాలుగు సంవత్సరాలుగా ఎడతెగనివిధంగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచదేశాలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ట్రంప్ (Trump) ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. ఈ పరిణామాల వల్ల ట్రంప్ ఇటీవల 20 సూత్రాల ఒప్పంద ప్రణాళికను ఉక్రెయిన్-రష్యాలకు విధించారు. అయితే వీటిని ఉక్రెయిన్ ఏమాత్రం అంగీకరించలేదు. ఇది ఒకవైపు ఇలా కొనసాగుతుండగానే..

Read Also: NandaDevi: భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

Ukraine We will think about it if security guarantees are given.. Zelensky

ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ (zelensky) రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ప్రకటిస్తూ.. కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగలకుండా పశ్చిమదేశాల నుంచి భద్రతా హామీలు లభిస్తే తమ దేశం నాటో కూటమిలో చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకోవడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. ఆదివారం బెర్లిన్ లో జరిగిన సమావేశంలో ఈవిధంగా చెప్పారు. నాటో సభ్య దేశాలకు ఉన్న తరహాలోనేభద్రతా హామీలను పశ్చిమదేశాలు తమకు అందించాలని జెలెన్స్కీ కోరారు. ‘ఈ భద్రతా హామీలు రష్యా నుంచి మరో దాడిని నిరోధించేందుకు ఒక అవకాశం. ఇది మా వైపు నుంచి చేస్తున్న రాజీ అని జెలెన్ స్కీ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

డొనెట్స్ ప్రాంతాన్ని అప్పగించలేం.. జెలెన్ స్కీ

రష్యాకు తమ భూభాగాన్ని అప్పగించాలనే అమెరికా ప్రతిపాదనను జెలెన్ స్కీ పూర్తిగా తిరస్కరించారు. తూర్పు ప్రాంతంలో డొనెట్స్ నుంచి ఉక్రెయిన్ బలగాలను ఉపసంహరించుకుని అక్కడ సైన్యం లేని స్వేచ్ఛా ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలనే ఆమెరికా ఆలోచన ఆచరణ సాధ్యం కాదని ఆయన కొట్టిపారేశారు. ఈ ఆర్థిక మండలిని ఎవరు నిర్వహిస్తారు? అని ప్రశ్నించిన ఆయన తాత్కాలికంగా సరిహద్దు వెంబడి బఫర్ జోన్ ఏర్పాటు చేస్తే ఉక్రెయిన్ దళాలు 5 నుంచి 10కిలో మీటర్లు వెనక్కి తగ్గితే, రష్యా దళాలు కూడా అదే దూరం వెనక్కి ఎందుకు తగ్గకూడదు? అని జెలెన్ స్కీ ప్రశ్నించారు. ఈ విషయమై స్పందించిన రష్యా విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉషాకోవ్ ఆ ప్రాంతం డీమిలిటరైజ్డ్ జోన్ గా మారినా కూడా డొనెట్స్ లోని కొన్ని ప్రాంతాల్లో రష్యా పోలీసు, నేషనల్ గార్డ్ దళాలు ఉంటాయని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Conditions for negotiation Future of Ukraine conflict. Google News in Telugu International diplomacy Ukraine Latest News in Telugu Security assurances demand Telugu News Today Ukraine security guarantees Ukraine war update Volodymyr Zelenskyy statement Zelenskyy on peace talks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.