📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Ukraine: ఐరోపా కోరుకుంటే యుద్ధానికి మేం సిద్ధం: పుతిన్

Author Icon By Sushmitha
Updated: December 3, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ (Ukraine) లమధ్య యుద్ధం వల్ల వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. నిత్యం వార్తల్లో నిలుస్తున్న పుతిన్ తాజాగా మరో అంశంతో మీడియాకెక్కారు. ఈసారి పుతిన్ ఐరోపా దేశాలకు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. యూరప్ కనుక యుద్ధాన్ని ప్రారంభించాలని కోరుకుంటే మేం దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడానికి.. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ మాస్కోలో పుతిన్ తో చర్చలు జరిపిన కీలక సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి.

Read Also: Donald Trump: క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్

Ukraine We are ready for war if Europe wants it: Putin

యుద్ధం చేసే ఉద్దేశం లేదు: పుతిన్

రష్యాకు యూరప్ తో యుద్ధం చేసే ఉద్దేశం లేదని పుతిన్ (Putin) పునరుద్ఘాటించారు. అయితే తన హెచ్చరిక యుద్ధాన్ని నిరోధించడం కోసం మాత్రమే చేసినట్లు వివరించారు. ఉక్రెయిన్ తో వివాదంపై ఒక అంగీకరాం కుదరకుండా యూరోపియన్ నేతలు అడ్డుకుంటున్నారని అదే సమయంలో నిందను మాస్కోపై మోపాలని చూస్తున్నారని పుతిన్ ఆరోపించారు. రష్యా డ్రోన్ చొరబాట్లు, గగనతల ఉల్లంఘనలు, విధ్వంసక చర్యల నేపథ్యంలో మాస్కో చొరబాట్లు, గగనతల ఉల్లంఘనలు, విధ్వంసక చర్యల నేపథ్యంలో మాస్కో లక్ష్యాలు ఉక్రెయిన్ దాటి ఉన్నాయని యూరోపియన్ ప్రభుత్వాలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తొలి శాంతి ముసాయిదా తయారీలో యూరప్ దేశాలను వాషింగ్టన్ పక్కన పెట్టడం పట్ల వారు అసంతృప్తితో ఉన్నారు. ఏదేమైనా యూరోపియన్ భాగస్వాములు అన్ని నిర్ణయాలలో పాలుపంచుకునేలా కృషి చేస్తున్నామని ఉక్రెయిన్ దౌత్యవేత్తలు తెలిపారు. మొత్తంగా ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ పుతిన్ హెచ్చరికలతో యూరప్ రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

ConflictEscalation EuropeChallenge GeopoliticalTension Google News in Telugu Latest News in Telugu MilitaryStance putin russia RussiaUkraineWar Telugu News Today ukraine WarReadiness

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.