📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Ukraine: ఉక్రెయిన్-అమెరికాల మధ్య మాటల యుద్దాలు..

Author Icon By Sushmitha
Updated: November 24, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమలుకు సాధ్యం కాని శాంతి ప్రణాళిక: జెలెన్ స్కీ

రష్యాతో నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జెనీవాలో కీలక చర్చలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ (Ukraine) పై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు తానెంతగానో కష్టపడితే కీవ్ తన ప్రయత్నాలకు సున్నా కృతజ్ఞతను తెలిపిందని ఆరోపిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఇది చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ (zelensky) వెంటనే స్పందించారు. ఎవరూ ఊహించని విధంగా రిప్లై ఇచ్చారు.

Read Also: Hyderabad Accident: ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

Ukraine Wars of words between Ukraine and the United States..

మీకెప్పుడూ మా కృతజ్ఞలు: జెలెన్ స్కీ

ఉక్రెయిన్ పట్ల తరచుగా భిన్నమైన వైఖరిని ప్రదర్శించే ట్రంప్ (Trump) తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోసల్ ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించారు. రష్యా డిమాండ్లకు అనుగుణంగా రూపొందించిన తన శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్ నాయకత్వం తమ ప్రయత్నాలకు సున్నాకృతజ్ఞతను వ్యక్తం చేసింది అని పోస్టు పెట్టారు. దీనిపై జెలెన్ స్కీ సమాధానం చెబుతు ‘ఉక్రెయిన్ దేశం అమెరికాకు, ప్రతి అమెరికన్ హృదయానికి, వ్యక్తిగతంగా అధ్యక్షుడు ట్రంప్నకు పూర్తి కృతజ్ఞతతో ఉందని పేర్కొన్నారు. జావెలిన్ క్షిపణుల ప్రారంభం నుంచి తమ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సాయాన్ని తామెప్పటికీ మర్చిపోమని వెల్లడించారు. అంతేకాకుండా ఉక్రెయిన్ కు అమెరికా అందించిన ఆయుధాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మీ డిమాండ్లను ఒప్పుకోలేం..

ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళిక ఒప్పందానికి తాము అస్సలే ఒప్పుకోలేమని జెలెన్ స్కీ వెల్లడించారు. గతంలో రష్యా కఠిన డిమాండ్లలో కొన్నింటిని చేర్చడం వివాదాస్పదంగా మారింది. ఆ డిమాండ్లలో ఉక్రెయిన్ భూభాగాన్ని అప్పగించడం, సైన్యాన్ని తగ్గిచడం, ఎప్పటికీ నాటోలో చేరబోమని ప్రతిజ్ఞ చేయడం వంటివి ఉన్నాయి. అయితే ఈ ప్రణాళికను ఆమోదించడానికి ట్రంప్ ఈనెల 27వ తేదీ వరకు (థాంక్స్ గివింగ్) వరకు ఉక్రెయిన్కు గడువు విధించారు. ఈ ప్రణాళిక ఒప్పందం ఏమాత్రం తమకు అనుకూలంగా లేకపోవడంతో అందుకు జెలెన్స్కీ ఒప్పుకోనని చెప్పారు. జెనీవాలో అమెరికా-ఉక్రెయిన్ అగ్ర అధికారులు 28 సూత్రాల ముసాయిదా శాంతి ప్రణాళికలో మార్పులు చేయడానికి నిమత్నమయ్యారు. ఉక్రెయిన్ భద్రతా మండలి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రస్టెమ్ ఉమెరోవ్ మాట్లాడుతూ శాంతి ప్రణాళిక తుడి ఆమోదం దశలో ఉందని చెప్పారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

diplomatic conflict feasibility concerns Google News in Telugu International Relations Latest News in Telugu Russia-Ukraine war. Telugu News Today Ukraine-US tensions Zelenskyy peace plan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.