📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Peace: అబుదాబిలో ఉక్రెయిన్-రష్యాల మధ్య కొనసాగుతున్న చర్చలు

Author Icon By Vanipushpa
Updated: January 24, 2026 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అబుదాబిలో రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అమెరికా ఒత్తిడి మేరకు ఉక్రెయిన్ ఈ శాంతి చర్చలకు అంగీకరించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఎలాగైనా ముగింపు పలికేలా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే అమెరికా ఈ చర్యలకు దిగింది. 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు ఇప్పటికీ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు.

Read Also: iPhone 18: ఐఫోన్ లాంచ్ ప్లాన్‌లో ట్విస్ట్.. ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

Peace: అబుదాబిలో ఉక్రెయిన్-రష్యాల మధ్య కొనసాగుతున్న చర్చలు

రష్యా చేతిలోనే యుద్ధానికి ముగింపు

ఇక.. తాజా శాంతి చర్చలకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడారు. యుద్ధానికి ముగింపు పలకడం రష్యా చేతిలోనే ఉందన్నాడు. ఎందుకంటే యుద్ధం మొదలుపెట్టింది రష్యానే అని గుర్తు చేవారు. తమ దేశం తరఫున చర్చలు జరుపుతున్న టీంను తాను నిరంతరం సంప్రదిస్తున్నానని, అయితే, ఈ విషయంపై ఏమీ చెప్పలేనని ఆయన అన్నాడు. రేపటికల్లా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నాడు. ఇటీవల దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్.. జెలెన్ స్కీని కలిశాడు. అక్కడే ఆయన శాంతి చర్చల గురించి ట్రంప్ అతడికి సూచించాడు. శాంతి చర్చలు సందర్భంగా తమ దేశ భద్రతకు యూరప్ హామీ ఇవ్వాలని జెలెన్ స్కీ కోరుతున్నాడు. శాంతి ఒప్పందం విషయంలో రష్యా మాత్రం కాస్త ఆలోచించి అడుగులేస్తోంది. ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతమైన డోనెస్క్ ప్రాంతాన్ననని తన ఆధీనంలో ఉంచుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుతున్నాడు. కానీ, దీనికి జెలెన్ స్కీ అంగీకరించడం లేదు. ఈ ప్రదేశం దాదాపు 5,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Abu Dhabi negotiations global political news International Diplomacy Middle East mediation Peace Talks Russia Ukraine Conflict Telugu News online Telugu News Today Ukraine Russia talks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.