📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Ukraine: సవరణల తర్వాతే శాంతి ప్రణాళిక: జెలెన్ స్కీ

Author Icon By Sushmitha
Updated: December 2, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై కీవ్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. సవరణలు చేసిన తర్వాతే శాంతి ప్రణాళిక మెరుగ్గా ఉందని సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తో భేటీ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతిపాదించిన ప్రణాళికలో ఎక్కువ శాతం రష్యాకు అనుకూలంగా ఉన్నాయంటూ ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. కీవ్ కు నాటో దేశాలు కూడా మద్దతుగా నిలిచాయి. 

Read Also: Pakistan: ఎల్వోసీలో వందకుపైగా ఉగ్రవాద శిబిరాలు

Ukraine Peace plan only after amendments: Zelensky

దీంతో ఆ ప్రణాళికలో కొన్ని మార్పులను సూచించాయి. తాజాగా సవరణ అనంతరం శాంతి ప్రణాళిక మెరుగ్గా ఉందని జెలెన్ స్కీ తెలిపారు. యుద్ధం ముగింపునకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ చర్చల్లో ఉక్రెయిన్ (Ukraine) సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతో పాటు బలమైన భద్రతా హామీలను పొందడం తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరుగుతున్నాయని తెలిపారు.

అయితే, ఇంకా పరిష్కారం కావాల్సిన కొన్ని కఠినమైన సమస్యలు ఉన్నాయని వివరించారు. ఇదిలా ఉండగా మంగళవారం పశ్చిమాసియాలోని అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ కానున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ క్రమంలోనే శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

యుద్ధం ముగింపు చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి 

ప్రస్తుతం యుద్ధం ముగింపు చర్చలను ప్రాథమిక దశలో ఉన్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ సమయంలో ఉక్రెయిన్ కు భద్రతా హామీ అవసరమని తెలిపారు. ఇదిలా ఉండగా శాంతి ప్రణాళికకు సంబంధించిన ఆదివారం ఉక్రెయిన్-అమెరికా అధికారుల మధ్య కీలక సమావేశం జరిగింది. దీని తర్వాత జెలెన్ స్కీ (zelensky) పారిస్ పర్యటనకు వెళ్లారు. చర్చలు సానుకూలంగా జరిగాయని వైట్ హౌస్ కూడా ధ్రువీకరించింది.

ఏదిఏమైనా నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ చాలావరకు నష్టపోయింది. అలాగే రష్యా కూడా ఆర్థికంగా నష్టపోయింది. సైన్యం కోసం రెండుదేశాలు చేస్తున్న అధిక ఖర్చుతో దేశంలో సామాన్యప్రజల అవసరాలు సరిగ్గా తీరడం లేదనే నింద ఉంది. యుద్ధం ఆగిపోవాలని ప్రపంచదేశాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AmendmentsRequired Donald Trump Geopolitics Google News in Telugu Latest News in Telugu PeacePlan RussiaUkraineWar Telugu News Today ukraine Zelensky

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.