📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

UK: మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

Author Icon By Anusha
Updated: March 12, 2026 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

UK: పని ప్రదేశంలో తోటి ఉద్యోగుల పట్ల, ముఖ్యంగా కింది స్థాయి సిబ్బంది పట్ల గౌరవంగా మెలగకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికి బ్రిటన్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని ఆమె బాస్ (యజమాని) తరచుగా తిట్టడం, అవమానకరంగా మాట్లాడటం చేసేవారు. బాస్ ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించగా, దిమ్మతిరిగే తీర్పు వెలువరించింది.. పని ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలే తప్ప.. ఇలాంటి అవమానకరమైన పరిస్థితులు ఉండకూడదని స్పష్టం చేస్తూ..బాధితురాలికి రూ.29 లక్షల పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించారు.

Read Also: Iran war: యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

‘పొటాటో’ వ్యాఖ్యపై కోర్టు ఆగ్రహం

బాస్ తనను పదే పదే ‘పొటాటో, పొటోటో’ (Potato,) అని పిలవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒక వ్యక్తిని వారి జాతి లేదా మూలాలను తక్కువ చేసేలా ఇలాంటి పదజాలం వాడటం ‘జాతి వివక్ష’, ‘వేధింపుల’ కిందకు వస్తుందని ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ నిర్ధారించింది.

UK: The man who brought the word.. What’s the story of the fine of 29 lakhs!

అసలేం జరిగిందంటే?

ఐర్లాండ్‌కు చెందిన బెర్నాడెట్ హేస్ అనే మహిళ.. లీడ్స్‌లోని ఒక సివిల్ ఇంజినీరింగ్ కంపెనీలో బుక్ కీపర్‌గా పని చేస్తోంది. అయితే ఆమె బాస్ మిక్ అట్కిన్స్.. ఆమె ఏం పని చేసినా ఎప్పుడూ కోప్పడేవాడు. తరచుగా ఆమె ఐరిష్ యాసను వెక్కిరిస్తూ.. గట్టిగా పొటాటో, పొటాటో అంటూ అరిచేవాడు. ఇది మాత్రమే కాకుండా ఐరిష్ ప్రజలను కించపరిచేలా ప్యాడీ, స్టూపిడ్ ప్యాడీ అంటూ జాతి వివక్షతో కూడాన పదజాలాన్ని వినియోగించేవాడు. బాస్ ఇలా తిట్టిన ప్రతీసారి బెర్నాడెట్ హేస్ చాలా బాధ పడేది.

అయితే ఈ వేధింపుల వల్ల తన ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బతిన్నదని బెర్నాడెట్ ట్రిబ్యునల్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు నెలల పాటు జరిగిన ఈ అవమానాల గురించి ఆమె వివరిస్తూ.. “ఆఫీసులోకి అడుగు పెట్టాలంటేనే భయం వేసేది. వెయ్యి కత్తులతో పొడిచినట్లుగా అనిపించేది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగం వదలలేక, బాస్ కోపాన్ని భయంతో మౌనంగా భరించాను. కానీ ఆయన నా మౌనాన్ని ఆసరాగా చేసుకుని మరింత రెచ్చిపోయేవారు” అని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

employee rights Potato Comment Fine UK workplace harassment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.