📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Keir Starmer: UNSC లో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై యూకే మద్దతు

Author Icon By Anusha
Updated: October 9, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో (UNSC) భారత్‌కు శాశ్వత సభ్యత్వం రావాలని భారత్‌ ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ ప్రయత్నానికి అంతర్జాతీయంగా మరింత బలం చేకూరింది. తాజాగా బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్ (British Prime Minister Keir Starmer) భారత పక్షాన తన మద్దతును బహిరంగంగా ప్రకటించారు.

Gaza Peace Deal : శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్‌-హమాస్‌

న్యూఢిల్లీ (New Delhi) లోని రాజ్‌భవన్‌లో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.భారత్ సాధిస్తున్న అద్భుతమైన అభివృద్ధిని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించగల సామర్థ్యాన్ని స్టార్మర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

“భద్రతా మండలిలో భారత్ తన హక్కుగా పొందాల్సిన స్థానాన్ని దక్కించుకోవడాన్ని మేము చూడాలనుకుంటున్నాం” అని ఆయన అన్నారు. భారత్ శాశ్వత సభ్యత్వానికి ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రష్యా వంటి దేశాలు మద్దతు తెలుపగా,

Keir Starmer

దశాబ్ద కాలంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రతినిధి

ఇప్పుడు యూకే (UK) కూడా అదే బాటలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.తన భారత పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ, గత దశాబ్ద కాలంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రతినిధి బృందంతో తాను ఇక్కడికి వచ్చినట్లు స్టార్మర్ (Keir Starmer) తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో భారత్, యూకేలు ప్రపంచ నాయకులుగా కలిసి నిలుస్తున్నాయని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలో బాలీవుడ్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందని కూడా ఆయన ప్రకటించారు.ఇదే సమయంలో, గాజాలో శాంతి ఒప్పందం (Peace agreement in Gaza) మొదటి దశకు చేరుకోవడం పట్ల స్టార్మర్ (Keir Starmer) హర్షం వ్యక్తం చేశారు.

ఇది ఎంతో ఉపశమనం కలిగించే క్షణమని, ఈ శాంతి ప్రణాళిక పూర్తిస్థాయిలో అమలు కావడానికి యూకే మద్దతుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News India UNSC membership Keir Starmer latest news Telugu News UK support India United Nations Security Council

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.