యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో ఉన్నత విద్య కోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం కొత్త ఈ-వీసా విధానాన్ని ప్రవేశపెడుతోంది. 2025 జూలై 15 నుంచి ఇది అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ చర్యతో విదేశీ విద్యార్థుల వీసా ప్రక్రియ మరింత సులభంగా, సాంకేతికంగా ముందడుగు వేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భౌతిక వీసా స్టిక్కర్ల స్థానంలో సురక్షితమైన డిజిటల్ రికార్డులను వాడుకలోకి తీసుకు రాబోతున్నారు.ఈ కొత్త విధానం కింద విద్యార్థులకు ఇకపై పాస్‌పోర్ట్‌పై భౌతిక వీసా ముద్ర (విగ్నేట్) ఉండదు. బదులుగా వారి ఇమ్మిగ్రేషన్ (Immigration) స్థితికి సంబంధించిన సమాచారం పాస్‌పోర్ట్‌కు లింక్ చేయబడిన సురక్షితమైన డిజిటల్ రికార్డుగా ఉంటుంది. ఈ డిజిటల్ రికార్డును ఆన్‌లైన్ యూకేవీఐ (UKVI – UK Visas and Immigration) ఖాతా ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
తప్పనిసరిగా
విశ్వవిద్యాలయాలు, గృహ యజమానులు, ఉద్యోగదాతలు కూడా గుర్తింపు, ఇమ్మిగ్రేషన్ స్థితిని ధృవీకరించడానికి ఈ డిజిటల్ వ్యవస్థను ఉపయోగిస్తారు.ఈ కొత్త వ్యవస్థకు అనుగుణంగా విద్యార్థులు యూకేకు ప్రయాణానికి ముందు కొన్ని కీలక దశలను పూర్తి చేయడం అత్యవసరం. వీటిలో ముఖ్యంగా ఐదు అంశాలు ఉన్నాయి. అవేంటంటే? యూకేవీఐ ఖాతా సృష్టి: విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారం, పాస్‌పోర్ట్ వివరా (Passport details) లను అప్‌డేట్ చేస్తూ, తప్పనిసరిగా ఆన్‌లైన్ యూకేవీఐ ఖాతాను సృష్టించుకోవాలి. ఈ ఖాతా లాగిన్ వివరాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.వీసా డెసిషన్ లేఖ: భౌతిక వీసా లేనందున, వీసా నిర్ణయ లేఖను (Visa Decision Letter) ప్రింటెడ్ లేదా డిజిటల్ కాపీని వెంట తీసుకెళ్లాలి. సరిహద్దు అధికారులు పాస్‌పోర్ట్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ-వీసాను యాక్సెస్ చేస్తారు.
ప్రయాణాన్ని సులభతరం
పాస్‌పోర్ట్ నవీకరణ: వీసా ఆమోదం తర్వాత పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరిస్తే.. ప్రయాణానికి ముందు ఈ మార్పులను యూకేవీఐ ఖాతాలో తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.విశ్వవిద్యాలయ, వసతి విధానాలు: విశ్వవిద్యాలయాల్లో నమోదు కోసం, వసతి కోసం ఇమ్మిగ్రేషన్ స్థితిని ధృవీకరించడానికి ఈ-వీసా అవసరం. కాబట్టి సంబంధిత విశ్వవిద్యాలయ, వసతి విధానాలను ముందుగానే పరిశీలించాలి. వీసా నిబంధనలకు కట్టుబడి ఉండటం: యూకేలో ఉన్నప్పుడు వీసా నిబంధనలకు కట్టుబడి ఉండటం సమస్యలను నివారించడానికి కీలకం.ఈ మార్పులన్నీ విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు యూకే (UK) సరిహద్దుల్లో మరింత పటిష్టమైన డిజిటల్ ఇమ్మిగ్రేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మిస్తాయి. విద్యార్థులు ఈ సూచనలను తప్పనిసరిగా పాటించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఉన్నత విద్యను ప్రారంభించాలని యూకే ప్రభుత్వం సూచిస్తోంది.
UK రాజధాని ఏమిటి?
లండన్ (London) UK యొక్క రాజధాని. ఇది ప్రపంచంలోని ముఖ్యమైన ఆర్థిక సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటి.
UK లో చదువు కోవడం వల్ల ప్రత్యేకత ఏమిటి?
UK లో ఉన్నత విద్యా సంస్థలు ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. అక్స్ఫర్డ్, కెంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవే. విద్యా నాణ్యతతో పాటు పరిశోధనకు ప్రాధాన్యత ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com