📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

UAE Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)(UAE) కొన్ని దేశాల వారికి ‘జీవితకాల గోల్డెన్ వీసా’(Golden Visa) మంజూరు చేస్తోందంటూ ప్రచారంలో ఉన్న వార్తలను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసీపీ) స్పష్టం చేసింది. యూఏఈ(UAE)లో నివసించాలనే ప్రజల ఆశలను, ఆశయాలను ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు చేస్తున్న మోసపూరిత ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

విదేశాలకు చెందిన ఓ కన్సల్టింగ్ కార్యాలయం, కొన్ని మీడియా సంస్థలు ఈ తప్పుడు వార్తలను ప్రచురించినట్లు ఐసీపీ గుర్తించింది. యూఏఈ ప్రభుత్వంతో సంబంధం లేని ఏ ప్రైవేట్ ఏజెన్సీ లేదా కన్సల్టెన్సీకి గోల్డెన్ వీసా దరఖాస్తులను స్వీకరించే అధికారం లేదని అధికారులు తేల్చిచెప్పారు. గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా మాత్రమే సంప్రదించాలని సూచించారు.

UAE Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన

యూఏఈ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే గోల్డెన్ వీసా

యూఏఈ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే గోల్డెన్ వీసా కేటగిరీలు, వాటికి ఉండాల్సిన అర్హతలను నిర్ణయిస్తారని ఐసీపీ వివరించింది. రియల్ ఎస్టేట్‌లో 2 మిలియన్ దిర్హమ్స్ పెట్టుబడి పెట్టడం, వ్యాపార యజమానులుగా ఉండటం, లేదా సైన్స్, కళలు, క్రీడలు వంటి రంగాల్లో విశేషమైన ప్రతిభ కనబరచడం వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వం గోల్డెన్ వీసాలను మంజూరు చేస్తుంది. నామినేషన్ల ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా ప్రభుత్వమే పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.

కొంత ఫీజు చెల్లిస్తే చాలు, గోల్డెన్ వీసా సులభంగా పొందవచ్చని కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని యూఏఈలో నివసించాలనుకునే, పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఐసీపీ విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా 600522222 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని కోరింది .

UAE గోల్డెన్ వీసాకు ఎవరు అర్హులు?
గోల్డెన్ వీసా ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యనిర్వాహకులు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, 15+ సంవత్సరాల అనుభవం ఉన్న నర్సులు, యూట్యూబర్‌లు, పాడ్‌కాస్టర్‌లు మరియు డిజిటల్ సృష్టికర్తలకు విస్తరించింది.
UAE గోల్డెన్ వీసా వల్ల ప్రయోజనం ఏమిటి?
గోల్డెన్ వీసా UAE ప్రయోజనాలు

నామినేషన్ కేటగిరీ కింద UAE గోల్డెన్ వీసా కోరుకునే దరఖాస్తుదారులు దుబాయ్ సందర్శించాల్సిన అవసరం లేకుండానే వారి స్వదేశం నుండి ముందస్తు అనుమతి పొందవచ్చు. ఈ వీసా ఆధారంగా సేవకులు మరియు డ్రైవర్లను కూడా ఉంచుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Brazil: భారత్-బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు

#telugu News Golden Visa Announcement Latest News Breaking News Residency Visa UAE UAE golden visa UAE Immigration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.