📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

UAE Pakistan deal cancelled : UAE డీల్ రద్దు, పాక్‌కు షాక్, భారత్ లింక్ ఏంటి?

Author Icon By Sai Kiran
Updated: January 27, 2026 • 8:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

UAE Pakistan deal cancelled : ఇటీవల Sheikh Mohamed Bin Zayed Al Nahyan భారత్ పర్యటన అనంతరం పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, కార్యకలాపాల ఒప్పందం నుంచి United Arab Emirates (UAE) తప్పుకున్నట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ ఎయిర్‌పోర్టును ఔట్‌సోర్సింగ్ చేయాలనే ప్రయత్నాల్లో యూఏఈ ఆసక్తి కోల్పోయిందని ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పేర్కొంది. సరైన భాగస్వామిని గుర్తించలేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపింది.

యూఏఈ అధ్యక్షుడు ఢిల్లీలో ప్రధాని Narendra Modi తో భేటీ అయిన కొద్దిరోజులకే ఈ పరిణామం వెలుగులోకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న రాజకీయ సమీకరణలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, టర్కీతో (UAE Pakistan deal cancelled) కలిసి పాకిస్థాన్ ‘ఇస్లామిక్ నాటో’ తరహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నించడం యూఏఈకి అసంతృప్తిని కలిగించిందని అంచనా. ఒప్పందం రద్దుతో ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టును ‘యాక్టివ్ ప్రైవేటీకరణ’ జాబితాలో చేర్చాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

UAE Pakistan deal cancelled

ఇదిలా ఉండగా, జనవరి 19న జరిగిన యూఏఈ అధ్యక్షుడి భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య కీలక వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ రంగంలో ఆయుధాల కొనుగోలు మాత్రమే కాకుండా, సాయుధ వాహనాల అప్‌గ్రేడ్, ఏఐ ఆధారిత యుద్ధ సాంకేతికత, రోబోటిక్స్‌లో సంయుక్త తయారీపై నిర్ణయం తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, ఉమ్మడి సైనిక విన్యాసాలపై కూడా అంగీకారం కుదిరింది.

ఇంధన రంగంలో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC), HPCL మధ్య 10 ఏళ్ల కాలానికి ఎల్‌ఎన్‌జీ ఒప్పందం కుదిరింది. ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు సరఫరా కానుంది. అలాగే అణు విద్యుత్, చిన్న అణు రియాక్టర్లు, అంతరిక్ష మౌలిక సదుపాయాల అభివృద్ధిలోనూ కలిసి పనిచేయనున్నారు. 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Gulf geopolitics India Middle East diplomacy India UAE defense deals Islamabad airport deal Latest News in Telugu Pakistan airport privatization Pakistan diplomatic setback Sheikh Mohamed bin Zayed India visit Telugu News UAE India relations UAE Pakistan deal cancelled UAE Pakistan relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.