📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Turkey: పాక్‌కు టర్కీ సహాయం.. పలు ప్రాంతాల్లో ఊపందుకున్న ‘బ్యాన్ టర్కీ’

Author Icon By Sudha
Updated: May 13, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్థాన్‌ (Pakistan)కు టర్కీ (Turkey) బహిరంగంగా మద్దతు పలకడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘బ్యాన్ టర్కీ’ ఉద్యమం పలు ప్రాంతాల్లో ఊపందుకుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలోని పుణె నగరంలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా, అక్కడి వ్యాపారులు టర్కీ యాపిల్స్‌ (Apples)ను బహిష్కరించారు.

Turkey: పాక్‌కు టర్కీ సహాయం.. పలు ప్రాంతాల్లో ఊపందుకున్న ‘బ్యాన్ టర్కీ’

పుణెలోని పండ్ల వ్యాపారులు టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్‌ను విక్రయించకూడదని నిర్ణయించారు. దీంతో స్థానిక మార్కెట్లలో టర్కిష్ యాపిల్స్ దాదాపుగా కనుమరుగయ్యాయి. కేవలం వ్యాపారులే కాకుండా, సాధారణ పౌరులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై, టర్కీ యాపిల్స్‌కు బదులుగా ఇతర దేశాల నుంచి వస్తున్న లేదా స్వదేశీ పండ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ బహిష్కరణ పుణె పండ్ల మార్కెట్‌పై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని అంచనా.
ప్రభుత్వానికి సంఘీభావం
సాధారణంగా టర్కిష్ యాపిల్స్ ద్వారా సీజన్‌లో సుమారు రూ.1000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, ఇప్పుడది దెబ్బతింటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదని, దేశ సాయుధ బలగాలకు, ప్రభుత్వానికి తమ సంఘీభావం ప్రకటించే చర్య అని వ్యాపారులు చెబుతున్నారు.
పుణెలోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) మార్కెట్‌లో యాపిల్ వ్యాపారం చేసే సుయోగ్ జెండే మాట్లాడుతూ, “మేము టర్కీ నుండి యాపిల్స్ కొనడం ఆపివేయాలని నిర్ణయించుకున్నాము. దానికి బదులుగా హిమాచల్, ఉత్తరాఖండ్, ఇరాన్, ఇతర ప్రాంతాల నుండి వచ్చే ఉత్పత్తులను ఎంచుకుంటున్నాము. ఇది మా దేశభక్తి విధి, దేశానికి మా మద్దతు” అని తెలిపారు. టర్కిష్ యాపిల్స్‌కు వినియోగదారుల నుంచి డిమాండ్ దాదాపు 50 శాతం పడిపోయిందని మరో పండ్ల వ్యాపారి తెలిపారు.
టర్కిష్ ఉత్పత్తుల బహిష్కరణ
స్థానిక వినియోగదారులు కూడా ఈ ధోరణికి మద్దతు పలుకుతున్నారు. ఓ కొనుగోలుదారుడు మాట్లాడుతూ, “మనకు ఎంచుకోవడానికి అనేక రకాల యాపిల్స్ అందుబాటులో ఉన్నప్పుడు, మనకు వ్యతిరేకంగా ఉన్న దేశం నుంచి ఎందుకు కొనాలి?” అని వ్యాఖ్యానించారు. టర్కీ వైఖరిపై పలు వైపుల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో, యాపిల్స్‌తో సహా టర్కిష్ ఉత్పత్తుల బహిష్కరణ ఉద్యమం మరింత ఊపందుకుంటోంది.

Read Also : USA: అమెరికా వస్తువులపై భారత్‌ సుంకాల ప్రతీకారం

'Ban Turkey' gaining momentum #telugu News Breaking News in Telugu Google news Google News in Telugu in many areas Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Turkey's help to Pakistan...

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.