ఉక్రెయిన్‌పై గెలిచి, ఆ దేశాన్ని ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదని అమెరికా జాతీయ గూఢచార విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard)తెలిపారు. ఇక రష్యాకు యూరప్‌పై దాడి చేయగల శక్తి ఉందన్న వాదనలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. యుద్ధఅనుకూల విధానాలకు మద్దతు కూడగట్టేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard)ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. రాయిటర్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, యూరప్ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఈ ప్రచారం జరుగుతోందని తులసి గబ్బార్డ్ ఆరోపించారు. యూరప్‌ను రష్యా ఆక్రమించాలని అనుకుంటోందన్న యూరోపియన్ యూనియన్, నాటో వాదనలకు అమెరికా గూఢచార వర్గాలు మద్దతు ఇస్తున్నాయనే ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. అవన్నీ పచ్చి అబద్ధాలను తేల్చి చెప్పారు.
Read Also: http://Parthiban cancels Dubai trip : దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…
ఈ ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. యూరోపియన్ యూనియన్ దేశాలపై దాడి చేస్తామన్న ఆరోపణలు అవాస్తవాలనీ.. అర్థరహితమని కొట్టిపారేశారు. పశ్చిమ దేశాల నేతలు సైనిక వ్యయాలను పెంచేందుకు ప్రజల్లో భయాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: