ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇస్లామిజం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, భద్రత, శ్రేయస్సుకు అతిపెద్ద ముప్పుగా మారుతుందని ఆరోపించింది. ఆస్ట్రేలియాలో ఇస్లామిస్టుల భారీ చొరబాటు వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దాడి ఎవరినీ ఆశ్చర్యపర్చలేదని ఆమె పేర్కొన్నారు. యూరప్ పరిస్థితి ఇప్పటికే అదుపు తప్పింది అని ఆస్ట్రేలియాలో కూడా అదే దారిలో పడే ప్రమాదం ఉందని వాచ్చరించింది. అయితే, అమెరికాకు ఇంకా సమయం ఉంది..కానీ అది ఎక్కువకాలం ఉండదని తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) వెల్లడించింది.
Read also: Ethiopia: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
Islam is a threat to world security
తులసీకి మద్దతు ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు తులసీ గబ్బార్డ్ మద్దతు ఇచ్చారు. యూఎస్ సరిహద్దులను భద్రపరచడంతో పాటు అనుమానిత ఉగ్రవాదులను బహిష్కరించడం, అమెరికన్ల భద్రతకు ముప్పు కలిగించే ధృవీకరణ లేని పౌరులను అడ్డుకోవడంపై ట్రంప్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకొచ్చింది. సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అమెరికా కూడా యూరప్, ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న పరిస్థితులనే ఎదుర్కొనే ప్రమాదం ఉందని గబ్బార్డ్ హెచ్చరించారు. ఆదివారం ఆస్ట్రేలియాలో ఓ తండ్రి కుమారుడు కలిసి యూదులు హనుక్కా పండుగ ఉత్స వాల్లో మునిగియుండగా కాల్పులు జరిపి, 16మందిని హతమార్చిన విషయం విధితమే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: