📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

TRUMP: సౌదీ అరేబియాలో ట్రంప్ మాటల తూటాలు

Author Icon By Shobha Rani
Updated: May 14, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌, పాకిస్థాన్​ (India-pak) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అమెరికా విజయవంతమైన పాత్ర పోషించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) మరోసారి వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రెండు దేశాల కాల్పుల విరమణ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్​తో ప్రధాని నరేంద్ర మోదీని పోల్చినట్లు కాంగ్రెస్​ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ట్రంప్ మాట్లాడిన వీడియో క్లిప్​ను సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పోస్ట్ చేశారు. “అమెరికా అధ్యక్షుడు మళ్లీ ఇలా అన్నారు: ‘నేను భారత్​, పాకిస్థాన్​ (India-pak) మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి వాణిజ్యాన్ని ఉపయోగించాను. వారు అంగీకరించారు. ఇద్దరూ గొప్ప నేతలు’ అలా డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ప్రధానమంత్రి మోదీని షెహబాజ్ షరీఫ్‌తో పోలుస్తున్నారు” అని పవన్ ఖేరా రాసుకొచ్చారు. అలాంటి పోలిక ప్రధాని మోదీకి ఆమోదయోగ్యమైనదా అని ఆయన ప్రశ్నించారు.

TRUMP: సౌదీ అరేబియాలో ట్రంప్ మాటల తూటాలు

కాంగ్రెస్ పార్టీ మండిపాటు – మోదీ, షెహబాజ్ పోలికపై విమర్శలు

కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ ఛైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి కూడా స్పందించారు. “‘పాకిస్థాన్ ప్రధాన మంత్రి, భారత ప్రధాన మంత్రి సమానం. పాక్, భారత్ సమాన శక్తులు’ అని అన్నారు. ఎవరు ఇలా అన్నారు? ప్రధాన మంత్రి మోదీ బెస్ట్ ఫ్రెండ్ ట్రంప్” అంటూ ఎద్దేవా చేశారు. సౌదీ అరేబియాలో ట్రంప్ వ్యాఖ్యలను షేర్​ చేసిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, ఈ కథనం సిలబస్‌లో భాగం కాదని వ్యాఖ్యానించారు.

కాల్పుల విరమణ ఒప్పందం – అమెరికా పాత్ర ఎంత?

కాగా, భారత్‌-పాకిస్థాన్‌ (India-pak) మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో దేశం కీలక పాత్రను విజయవంతంగా పోషించిందని డొనాల్డ్​ ట్రంప్​, సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇటీవల మళ్లీ పాత పాట పాడారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరగకుండా అమెరికా నిలువరించిందని పేర్కొన్నారు. శాంతిపరిరక్షకుడిగా, ఐక్యతావాదిగా ఉండాలన్నది ఎప్పుడూ తన ఆశయమని తెలిపారు.
భారత్‌-పాక్‌ (India-pak) మధ్య ఒప్పందం కుదిరేందుకు వాణిజ్యాన్ని ఉపకరణంగా వినియోగించానని పేర్కొన్నారు. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందామని, కొంత వ్యాపారం చేద్దామని ఇద్దరికీ నచ్చజెప్పానని అన్నారు. వారిద్దరూ (భారత్‌- పాక్‌ ప్రధానులు) గొప్ప, శక్తిమంతమైన, తెలివైన నేతలుగా వ్యాఖ్యానించారు. అందుకే యుద్ధం నిలిచిపోయిందని అన్నారు. అది అలాగే కొనసాగాలని ఆశిద్దామని తెలిపారు.

Read Also: Retired Jawan Murdered : రిటైర్డ్ జవాన్ దారుణ హత్య



#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Trump's words in Saudi Arabia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.