అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటనలతో మళ్లీ ప్రపంచ దృష్టి మధ్యప్రాచ్యంపై పడింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధం ముగిసిందని, ఇరు దేశాలు కాల్పులు ఆపేందుకు అంగీకరించాయని ఆయన ప్రకటించారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్ట్‌లో ట్రంప్, ఈ విరమణ ఆరు గంటల్లో అమల్లోకి వస్తుందన్నారు. తొలి 12 గంటలు ఇరాన్ (Iran) కాల్పులు ఆపుతుందని, తర్వాత ఇజ్రాయెల్ కూడా సమాధానంగా అదే చేస్తుందని వెల్లడించారు.ఈ కాల్పుల విరమణ ఒప్పందం, మధ్యప్రాచ్యాన్ని విధ్వంసం నుంచి రక్షించగలదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలూ ఓర్పు, ధైర్యం చూపినందుకు ఆయన ప్రశంసలు గుప్పించారు. అయితే ఇది పూర్తిగా అమలవుతుందా? అనే సందేహం వెంటనే మిగిలిపోయింది.
ఇరాన్ నుంచి ఆగ్రహావేశం
ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమకు అమెరికా నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ దురుద్దేశ్యాలకు ఈ ప్రకటనను ఉపయోగిస్తున్నాయని ఆరోపించింది. “శత్రువుల అబద్ధాలు మేము నమ్మము. వారే మొదటగా దాడి చేస్తున్నారు” అని ఓ సీనియర్ ఇరాన్ అధికారి పేర్కొన్నారు.
ఇరాన్ విదేశాంగ శాఖ ఖండన
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి కూడా ఇదే మాటలతో స్పందించారు. ఇజ్రాయెల్‌తో ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటించిన విషయాలన్నీ వాస్తవం కాదని ఖరాఖండిగా పేర్కొన్నారు.
అధికారిక ప్రకటనలు లేనిది గందరగోళానికి దారి
ఈ విభిన్న ప్రకటనల నేపథ్యంలో కాల్పుల విరమణపై తీవ్ర అయోమయం నెలకొంది. ఇజ్రాయెల్, ఇరాన్ నుంచి ఎటువంటి ధృవీకరణ లేకపోవడం స్పష్టత కొరతను చూపిస్తోంది. వైట్ హౌస్, పెంటగాన్ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామంపై ఉత్కంఠ పెరుగుతోంది.
Read Also : Operation Sindhu : ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు