📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Latest News: Donald Trump: చర్చనీయాంశంగా ట్రంప్ ప్రతిపాదించిన  శాంతి ప్రణాళిక

Author Icon By Aanusha
Updated: November 23, 2025 • 9:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన తాజా శాంతి ప్రణాళిక అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రతిపాదించారు. ఇది తన ‘తుది ప్రతిపాదన’ కాదని ట్రంప్ (Donald Trump) స్పష్టం చేసినప్పటికీ, నవంబర్ 27లోగా అంగీకరించాలంటూ ఉక్రెయిన్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

Read Also: Ukraine peace plan : ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై ట్రంప్ స్పష్టీకరణ “జెలెన్స్కీ ఆమోదం లేకుండా

మరోవైపు, ఈ ప్రణాళికలో చాలా మార్పులు అవసరమని ఉక్రెయిన్ మిత్రదేశాల కూటమి తేల్చిచెప్పింది.శనివారం ఉదయం వైట్‌హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఒకవేళ జెలెన్‌స్కీ ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే, ఆయన ‘చివరి వరకు పోరాడుకోవచ్చని’ వ్యాఖ్యానించారు. శాంతి స్థాపనే తమ లక్ష్యమని, ఎలాగైనా దాన్ని సాధిస్తామని అన్నారు.

తాను 2022లో అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధమే జరిగేది కాదని పునరుద్ఘాటించారు.ఈ ప్రణాళికపై మరో తీవ్రమైన ఆరోపణ తెరపైకి వచ్చింది. 28 పాయింట్లు ఉన్న ఈ పత్రం వాస్తవానికి రష్యా నుంచి వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) సెనేటర్లకు చెప్పినట్లు రిపబ్లికన్ సెనేటర్ మైక్ రౌండ్స్ వెల్లడించారు.

ఈ ప్రతిపాదన ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం

అయితే ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించలేదు. బయటకు వచ్చిన వివరాల ప్రకారం ఈ ప్రతిపాదన ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం కలిగించేలా ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న తూర్పు దొనెట్స్క్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని, దొనెట్స్క్, లుహాన్స్క్, క్రిమియాలపై రష్యా నియంత్రణను అంగీకరించాలని ఇందులో ఉంది.

Trump’s proposed peace plan is a topic of discussion

అంతేకాకుండా, ఉక్రెయిన్ సైన్యాన్ని 6 లక్షల మందికి పరిమితం చేయాలనే నిబంధనపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపాదనలను మెరుగుపరిచేందుకు

“మన చరిత్రలోనే అత్యంత కఠినమైన దశలో ఉన్నాం. ఆత్మగౌరవం వదులుకోవడమా లేక కీలక భాగస్వామిని కోల్పోవడమా అనే క్లిష్టమైన ఎంపికను ఎదుర్కోవాల్సి రావొచ్చు” అని ఆయన అన్నారు. ప్రతిపాదనలను మెరుగుపరిచేందుకు ఆదివారం జెనీవాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఉక్రెయిన్ భద్రతాధికారులు సమావేశం కానున్నారు. ఈ ప్రణాళిక ఒక ‘ఆధారంగా’ పనిచేస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) పేర్కొనడం గమనార్హం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Donald Trump peace plan latest news Russia Ukraine War Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.