📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

NATO Accepting Trump Demand : ట్రంప్ డిమాండ్ vs నాటో సామర్థ్యం: మార్క్ రుట్టే

Author Icon By Shobha Rani
Updated: June 6, 2025 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Demand) డిమాండ్ చేస్తున్నట్లు, నాటో (NATO) దేశాలు తమ రక్షణ పెట్టుబడులను 5 శాతం మేర పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే పేర్కొన్నారు. బ్రస్సెల్స్​లోని కూటమి ప్రధాన కార్యాలయంలో నాటో (NATO) రక్షణ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన మార్క్​ రుట్టే, తరువాత విలేకరులతో మాట్లాడారు. తదుపరి నాటో (NATO) శిఖరాగ్ర సమావేశం నాటికి సభ్య దేశాలు అన్నీ రక్షణ పెట్టుబడులు పెంచే విషయంపై ఒక ఒప్పందానికి వస్తాయనే పూర్తి నమ్మకం తనకు ఉందని రుట్టే అన్నారు. 2022లో రష్యా, ఉక్రెయిన్​పై పూర్తి స్థాయి దాడులు ప్రారంభించినప్పటి నుంచి కెనడా సహా యూరోపియన్ మిత్రదేశాలు తమ సాయుధ దళాలు, ఆయుధాలు, ముందుగుండు సామగ్రిపై భారీగా పెట్టుబడులు పెట్టాయని మార్క్ రుట్టే తెలిపారు. వాస్తవానికి నాటో దేశాలు రక్షణ పెట్టుబడుల కోసం తమ జీడీపీలో 5 శాతాన్ని కేటాయించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా సైనిక వ్యయంపై 3.5 శాతాన్ని, సైన్యాలు మోహరించడానికి అవసరమైన రోడ్లు, వంతెనలు, వైమానిక స్థావరాలు, ఓడరేవుల కోసం 1.5 శాతం పెట్టుబడులు పెట్టాలని ఆయన అంటున్నారు. అయితే ట్రంప్ చేస్తున్న ఈ డిమాండ్​ను కొన్ని నాటో (NATO) దేశాలు తిరస్కరిస్తున్నాయి.
రష్యా కారణంగా నాటో కాలపరిమితి మార్పులు
2023లో నాటో దేశాలు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాయి. రక్షణ బడ్జెట్​ కోసం తమ జీడీపీలో కనీసం 2 శాతాన్ని ఖర్చు చేయడానికి అంగీకరించాయి. అయితే నాటోలోని 32 దేశాల్లో కేవలం 22 దేశాలు మాత్రమే ఈ విధంగా చేస్తున్నాయి. మిగతా దేశాలు రక్షణ బడ్జెట్​ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేక, తమ లక్ష్యాన్ని చేరుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరోసారి తన డిమాండ్​ను గట్టిగా వినిపించారు. ఇండో-పసిఫిక్​ సహా తమ సొంత సరిహద్దుల్లో భద్రతా ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని నాటోలోని దేశాలన్నీ తమ జీడీపీలో కచ్చితంగా 5 శాతాన్ని రక్షణ బడ్జెట్ కోసం కేటాయించాలని ఆయన కోరుతున్నారు. బహుశా జూన్​ 24-25 తేదీల్లో హేగ్​లో జరగనున్న నాటో శిఖరాగ్ర సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది.

NATO Accepting Trump Demand : ట్రంప్ డిమాండ్ vs నాటో సామర్థ్యం: మార్క్ రుట్టే

అమెరికా – నాటోలో పెద్దదే కానీ పెట్టుబడులు తగ్గినవే
ఇక డాలర్ల పరంగా చూస్తే, నాటోలోని అన్ని దేశాల కంటే అమెరికానే చాలా ఎక్కువగా రక్షణ పెట్టుబడులను పెడుతోంది. అయితే ఇటీవలి నాటో గణాంకాల ప్రకారం, అమెరికా 2024లో తన జీడీపీలో కేవలం 3.19 శాతాన్ని మాత్రమే రక్షణ బడ్జెట్ కోసం కేటాయించింది. ఒక దశాబ్దం క్రితం అమెరికా రక్షణ పెట్టుబడులు 3.68 శాతం ఉంటే, ఇది చాలా తక్కువ. ఈ విధంగా రక్షణ పెట్టుబడులు తగ్గించిన ఏకైక నాటో దేశంగా అమెరికా నిలిచింది. నాటో కూటమి సాధారణ ప్రమాణాల ప్రకారం దేనికైనా 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కానీ 2014లో రష్యా, క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఈ నియమం మారింది. కేవలం 7 సంవత్సరాల్లోనే తమ నాటో దేశాలు తమ రక్షణ బడ్జెట్​ కేటాయింపులను 2 శాతానికి పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ట్రంప్ డిమాండ్‌ – న్యాయమైనదేనా?
యూఎస్​ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్​, నాటో (NATO)ను కాపాడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంతో ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. యూరప్​, ఆర్కిటిక్​, ఉత్తర అట్లాంటిక్​లను రక్షించుకోవడం కోసం సరైన ఆయుధాలు, సైనిక సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘నాటో లక్ష్యం ప్రకారం, కూటమిలోని 32 దేశాలు- వాయు రక్షణ వ్యవస్థలు, దీర్ఘ శ్రేణి క్షిపణులు, ఫిరంగులు, మందుగుండు సామగ్రి, డ్రోన్​లు, గాలిలోనే ఇంధనం నింపే సామర్థ్యం, భారీ వాయు రవాణా, లాజిస్టిక్స్​ను సమకూర్చుకోవాలి. ఇందుకోసం రక్షణ పెట్టుబడులను పెంచుకోవాల్సిందే’ అని పీట్​ హెగ్సేత్ స్పష్టం చేశారు. నాటో (NATO) ప్రణాళిక ప్రకారం, 30 రోజుల్లో 3లక్షల మంది సైనికులను తూర్పు భాగానికి తరలించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ దీనిని వాస్తవ రూపంలోకి తేలేక నాటో దేశాలు ఇబ్బందిపడుతున్నాయి.

Read Also: Narendra Modi: చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభించిన

#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Mark Rutte Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Trump's demand vs NATO's capacity:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.