📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకు భారీ నష్టం

Author Icon By Shobha Rani
Updated: May 24, 2025 • 2:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యవహారశైలితో అటు ప్రపంచ దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా తలపట్టుకుంటోంది. ఆయన దుందుడుకు చర్యలకు అమెరికా టూరిజం భారీగా నష్టంపోయింది. ప్రపంచ దేశాలకు ట్రంప్ (Trump) విధించిన ఆంక్షలు కారణంగా ఒక్క 2025లోనే అమెరికాకు ఏకంగా 12.5 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అక్కడి స్థానిక వార్తాకథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ (Trump) .. ఎవరి మాట వినకుండా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాలు తాను చెప్పినట్లే నడచుకోవాలని ఉచిత సలహాలు ఇస్తూ ఆయా దేశాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్(Trump) .. అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు అన్ని దేశాలపై టారిఫ్ ఆంక్షలు విధించారు. అమెరికాలోని యువతకే ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి దక్కాలని.. విదేశీ విద్యార్థులపై కఠినమైన రూల్స్ తీసుకొచ్చారు. ఇలా అనేక నిర్ణయాల కారణంగా పర్యాటకంలో అమెరికాకు భారీ నష్టం ఏర్పడనుందని ది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్(WTTC) అంచనా వేసింది. 2024లో పర్యాటకం విభాగంలో అమెరికాకు 181 బిలియన్ డాలర్లు ఆదాయం రాగా.. ఈ ఏడాది కేవలం 169 బిలియన్ డాలర్లు మాత్రమే ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ట్రంప్ (Trump) అధికారంలోకి వచ్చాక వలసదారులపై తీసుకున్న పలు కఠిన నిర్ణయాల కారణంగా ఇతర దేశాల ప్రజలు అమెరికా అంటేనే భయపడుతున్నారని డబ్ల్యూటీటీసీ తెలిపింది.

Trump: ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకు భారీ నష్టం

184 దేశాల్లో ఒక్క అమెరికాలోనే మైనస్ గ్రోత్‌
డబ్ల్యూటీటీసీ మొత్తం 184 దేశాలపై సర్వే నిర్వహించగా అమెరికాలో మాత్రమే టూరిజం తగ్గినట్లు తేలిందని పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది పర్యాటకం నుంచి వచ్చిన ఆదాయంలో 90 శాతం స్వదేశీ పర్యాటకుల ద్వారానే వచ్చిందని తెలిపింది. ఇతర దేశాల పర్యాటకులకు వెల్ కమ్ చెబుతుంటే అమెరికా మాత్రం కఠిన ఆంక్షలు విధిస్తోందని డబ్ల్యూటీటీసీ ప్రెసిడెంట్ జూలియా సింప్స్ సన్ తెలిపారు. పలు దేశాలపై విధించిన ఆంక్షలపై ట్రంప్ సర్కార్ సమీక్ష జరపాలని సూచనలు చేశారు.ట్రంప్ తీరు వల్ల విదేశీయులకు వ్యతిరేకంగా కనిపించే పరిణామాలు, అమెరికాకు ఆర్థికంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మానవ సంబంధాల్లోనూ నష్టాన్ని తెచ్చాయి. టూరిజం వంటి కీలక రంగాలు తిరిగి పుంజుకోవాలంటే వెల్‌కమ్ పాలసీ, మృదువైన వలస విధానాలు అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యాటకరంగం సంక్షోభం కారణంగా అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది 60 నుంచి 120 బిలియన్ డాలర్ల నష్టం చవిచూడనుందని న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జుక్కా లైటమాకీ తెలిపారు. ట్రంప్ (Trump) ఆంక్షల కారణంగా అమెరికా, కెనడాల మధ్య కూడా సంబంధాలు దెబ్బతిన్నట్లు వివరించారు.

Read Also: Trump: హార్వర్డ్‌పై ట్రంప్ పరిపాలన.. ఘాటుగా స్పందించిన చైనా

Breaking News in Telugu Google news Google News in Telugu loss for America Paper Telugu News Telugu News online Telugu News Paper Today news Trump's Decisions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.