📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump: భారత ఫార్మారంగంపై ట్రంప్ భారీ దెబ్బ

Author Icon By Pooja
Updated: September 26, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు రోజుకో కొత్త రూల్స్ తీసుకొస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. గతవారం హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్లు (రూ. 88లక్షలు) చెల్లించాలని హుకుం జారీ చేశారు. ఏవిధంగానైనా విదేశీయుల రాకను అరికట్టేందుకు తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తున్నది భారత్ పై సుంకాలు పెంచారు. పాకిస్తాన్కు దగ్గరయ్యేందుకు ట్రంప్ యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా డోనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ అధ్యక్షుడు షెహనాజ్ షరీఫీతో(Shehnaaz Sharifi) వైట్ హౌస్లో విందులో భేటీ అయ్యారు.

తాజాగా ట్రంప్ మరో పిడుగులాంటి వార్త చెప్పారు. అక్టోబర్ 1 నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని బ్రాండ్ లేదా పేటెంట్ ఉన్న ఔషధాలపై 100శాతం టారిఫీ విధించనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం భారతీయ కంపెనీలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. అయితే అమెరికాలో తయారీ యూనిట్ల నిర్మాణం చేపట్టిన కంపెనీలకు మాత్రం ఈ టారిఫ్ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియాలో ‘ట్రూత్ సోషల్'(Truth Social)’ వేదికగా పేర్కొన్నారు. వ్యాపారులు తొలుత విధించిన సుంకాలను అలవాటు పడుతున్న క్రమంలోనే ట్రంప్ కొత్త సుంకాలతో అలజడి సృష్టిస్తున్నారు. ‘అమెరికాలో తయారీ ప్లాంట్ ను నిర్మించని కంపెనీకి సంబంధించిన బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై అక్టోబరు 1 నుంచి 100శాతం టారిఫ్ను విధాస్తాం. నిర్మాణంలో ఉన్న కంపెనీ ఉత్పత్తులపై టారిఫ్ ఉండదు’ అని ట్రంప్ ప్రకటించారు.

Telugu News: Uttam Kumar Reddy: భారత్ కు విత్తన అక్షయపాత్రగా తెలంగాణ ఎదగాలి

కంపెనీలపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి

ట్రంప్ ఎప్పటి నుంచో అమెరికాలోనే ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కంపెనీలను ఒత్తిడి చేస్తున్నారు. టారిఫ్లను విధించడం ద్వారానే కంపెనీలు దేశీయ కర్మాగారాల్లో మరింత పెట్టుబడి పెట్టేలా బలవంతం చేయవచ్చని ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ పన్నుల భారాన్ని దిగుమతిదారులు అధిక ధరల రూపంలో వినియోగదారులకు, వ్యాపారులకు బదిలీ చేస్తారనే భయాలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం సమస్య కాదని ట్రంప్ పదేపదే చెబుతున్నప్పటకీ, ఆ దేశంలో ధరల సూచీ గత 12 నెలల్లో 2.9శాతం పెరగడం గమనార్హం. ఈ టారిఫ్లు, ఇల్లు కొనాలని చూస్తున్న అనేకమందికి ఇంటి నిర్మాణ ఖర్చులను మరింత పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గృహాల కొరత వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన క్యాబినెట్ సుంకాలు గృహనిర్మాణదారులకు మరింత వ్యయాన్ని పెంచుతాయి.

భారత ఫార్మారంగంపై ప్రభావం

భారతీయ ఔషధ పరిశ్రమకు అమెరికా ప్రధాన మార్కెట్. భారత ఔషధ ఎగుమతుల్లో 40శాతం అమెరికా వెళ్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా విధించనున్న ఈ 100శాతం టారిఫ్, భారతదేశ ఫార్మాస్యూటికల్ (ఔషధ) పరిశ్రమపై తీవ్రప్రభావం చూపవచ్చని అంచనా. ఫార్మాస్యూటికల్ రంగంపై టారిఫ్లు విధిస్తే భారతీయ ఫార్మా కంపెనీల ఆదాయాలపై గణనీయమైన ప్రభావం పడవచ్చని ఈ ఏడాది ఆగస్టులో ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ట్రంప్ భారతీయ ఫార్మా ఎగుమతులపై 50 శాతం టారిఫ్ విధించినట్లయితే, 2026 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కంపెనీల ఆదాయాలు 5 నుంచి 10శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఆ నివేదిక అంచనా వేసింది.

ట్రంప్ భారత ఫార్మా రంగంపై ఏ చర్యలు తీసుకున్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఔషధ ఎగుమతులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఫార్మా రంగం భారీగా ప్రభావితమైంది.

ఈ నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమపై ఎలా ప్రభావం చూపుతుంది?
ఎగుమతులు తగ్గే అవకాశం ఉండటంతో పాటు, లాభాలు తగ్గిపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ మరింత పెరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Indian Pharmaceutical Industry Latest News in Telugu Pharma Exports Telugu News Today Trump Pharma Impact Trump Policies US India Trade

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.