📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump-Zhelensky: చిరునవ్వులతో ముగిసిన ట్రంప్-జెలెన్ స్కీ భేటీ

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా-ఉక్రెయిన్ లమధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. గతవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో,ట్రంప్ అలాస్కాలో జరిగిన భేటీ ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసిపోయింది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లమధ్య జరిగిన,భేటీ చిరునవ్వులతో ముగిసింది. ఈ సందర్భంగా జెలెన్ స్కీ సూట్ కి సంబంధించి ఆసక్తికర పరిణామం జరిగింది. జెలెన్ స్కీ వేసుకున్న సూట్ అద్భుతంగా ఉందంటూ,అమెరికా మీడియా ప్రతినిధి ఒకరు కితాబిచ్చారు. దానికి ట్రంప్ స్పందిస్తూ, అప్పుడేనీపై అటాక్ చేసింది ఇతడేనంటూ సరదాగా గుర్తు చేశారు.

గతంలో మధ్యలోనే ఆగిపోయిన చర్చలు

ఫిబ్రవరి మాసంలో ట్రంప్-జెలెన్ స్కీ (Trump-Zhelensky) లమధ్య యుద్ధ ముగింపు విషయాలపై చర్చించడానికి వైట్ హౌస్లో సమావేశమైన విషయం తెలిసిందే. కానీ ఆ సమావేశంవాడీవేడిగా సాగి మధ్యలోనే వీగిపోయింది. ఆ భేటీలో జరిగిన వారి సంభాషణలో ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ జెలెన్ స్కీని అగౌరపరిచారు. భవిష్యత్తులో రష్యా తనపై దాడికి దిగితే రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ ట్రంప్ ను కోరారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రంప్, జెలెన్ స్కీల వివాదం చెలరేగింది. దీంతో ఈ సమావేశం,అర్థాంతరంగా ముగిసింది. ఒప్పందంపై ఎలాంటి సంతకాలు చేయకుండానే జెలెన్ స్కీ సీరియస్ గా వైట్ హౌస్ నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు.

టీ షర్టుతో హాజరైన జెలెన్ స్కీ.. పలువురి విమర్శలు

గతంలో జరిగిన సమావేశానికి జెలెన్ స్కీ టీ షర్టు వేసుకోవడంపై అమెరికా అధ్యక్షుడితో సహా అక్కడి మీడియా వర్గాలు విమర్శలు గుప్పించారు. టీ షర్టుతోనే వైట్ హౌస్ (White House) అధికారిక భేటికి హాజరవడం తీవ్ర వివాదాస్పదమయ్యింది. సమావేశంలో మీడియా ప్రతినిధి బ్రియాన్ గ్లెస్, మీరెందుకు సూట్ వేసుకోలేదు? అని ప్రశ్నించారు.’దేశంలోనే అత్యున్నత కార్యాలయాన్ని మీరు గౌరవించడం లేదని అనేకమంది అమెరికన్లు అనుకుంటున్నారు. అసలు మీకు సొంత సూట్ ఉందా?’ అని జెలెన్ స్కీనినేరుగా అడిగారు. దానికి జెలెన్ స్కీ యుద్ధం ముగిసిన తర్వాత సూట్ వేసుకుంటానని సమాధానమిచ్చారు.

సూట్ లో మెరిసిన జెలెన్ స్కీ

సూట్లో మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు, బాగున్నారు’ అంటూ మీడియా ప్రతినిధి బ్రియాన్ గ్లెన్ జెలెన్ స్కీని ప్రశంసలు కురిపించారు. వెంటనే ట్రంప్ జోక్యం చేసుకొని, గతంలో మీపై మాటలతో దాడి చేసింది కూడా ఈ విలేకరేనని చెప్పారు. దీనికి అవును నాకు గుర్తుంది అని జెలెన్ స్కీ బదులిచ్చారు. ‘మీరు అదే సూట్ లో ఉన్నారు. నేను మాత్రం మార్చుకున్నారు’ అంటూ గ్లెన్ను ఉద్దేశిస్తూ జెలెన్ స్కీ చెప్పడంతో అంతా నవ్వుకున్నారు. ఏదీ ఏమైనా రష్యా-ఉక్రెయిన్ లమధ్య సుదీర్ఘకాలంగాకొనసాగుతున్న యుద్ధం ముగింపుకు చేరుకుంటే బాగుంటుందని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఈ భేటీ పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది. యుద్ధం ముగింపు ప్రయత్నాలపై సానుకూల ప్రకటనలు చేశారు. చూద్దాం త్వరలో యుద్ధం ఆగిపోవాలని మనం ఆకాంక్షిద్దాం.

జెలెన్‌స్కీ ఎలా రాజకీయాల్లోకి వచ్చారు?

రాజకీయాల్లోకి రావడానికి ముందు జెలెన్‌స్కీ “సర్వెంట్ ఆఫ్ ది పీపుల్” అనే టీవీ సిరీస్‌లో సాధారణ ఉపాధ్యాయుడు అధ్యక్షుడిగా మారే పాత్ర పోషించారు. ఆ సిరీస్ విశేష ప్రజాదరణ పొందింది. ఆ తరువాత ఆయన అదే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

జెలెన్‌స్కీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది?

జెలెన్‌స్కీ 1978 జనవరి 25న ఉక్రెయిన్‌లోని క్రివీ రిహ్ పట్టణంలో జన్మించారు. ఆయన భార్య పేరు ఒలెనా జెలెన్‌స్కా. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/donald-trump-trump-shocks-more-than-six-thousand-foreign-student-visas-cancelled/international/532595/

Alaska meeting Breaking News Donald Trump latest news Peace Talks Russia Ukraine War Telugu News US Politics Vladimir Putin Volodymyr Zelensky

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.