📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump-Jinping: ట్రంప్-జిన్‌పింగ్ మధ్య వాణిజ్య ఒప్పందం.. భారత్‌కు షాక్!

Author Icon By Vanipushpa
Updated: October 30, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌(Jinping)ల మధ్య జరిగిన సమావేశం తర్వాత అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తక్షణమే చైనాపై ఉన్న సుంకాలను 10 శాతం తగ్గించారు. దీంతో టారిఫ్ 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గింది. ఇది భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్ కంటే తక్కువ కావడం గమనార్హం. టారిఫ్ తగ్గింపునకు బదులుగా చైనా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సోయాబీన్ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా వ్యూహాత్మకం చాలా ముఖ్యమైన రేర్ ఎర్త్ మినరల్స్ (Rare Earth Minerals) సరఫరాను కూడా తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. మరి ఈ అమెరికా-చైనా డీల్ వల్ల భారత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

Trump-Jinping

అమెరికాకు ఎగుమతుల్లో చైనా అగ్రస్థానం

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదరడం, భారత్‌తో వాణిజ్యంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రపంచ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. 1.చైనాపై భారత్ కంటే తక్కువ టారిఫ్ సమస్య: అమెరికాకు ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. గతంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికన్ కంపెనీలు చైనాకు బదులుగా భారత్, వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల భారత్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూరింది. ప్రభావం: చైనా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సోయాబీన్ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా అమెరికా నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

డీల్ కారణంగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు మెరుగు

మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై ఒత్తిడి సమస్య: ఈ డీల్ కారణంగా అమెరికా, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. చైనా నుంచి తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించాలని గత కొన్నేళ్లుగా అనుకుంటున్న అమెరికన్ కంపెనీలు తమ ప్రణాళికలను మార్చుకోవచ్చు. ప్రభావం: చైనా తర్వాత అమెరికన్ కంపెనీలకు భారత్ మొదటి ఎంపికగా ఉంది. ఈ పరిస్థితుల్లో, అమెరికన్ కంపెనీలు చైనాలో కొనసాగితే, భారతదేశ మ్యానుఫ్యాక్చరింగ్ (తయారీ) రంగానికి నష్టం వాటిల్లుతుంది.

చైనా నాయకుడు ఏ మతం?
2012లో జి జిన్‌పింగ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, అధికారికంగా నాస్తికుడైన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) మతాలపై ఆంక్షలను కఠినతరం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Donald Trump Global Trade india International Relations Telugu News US China Trade Deal Xi Jinping

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.