📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump -Jinping: ట్రంప్‌, జిన్‌పింగ్‌ భేటీ..ఒకరిపై ఒకరు ప్రశంసలు

Author Icon By Vanipushpa
Updated: October 30, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిన్న మొన్నటి వరకు వాణిజ్య యుద్ధంతో తగువులాడుకున్న చైనా(China), అమెరికా(America) మళ్లీ ఒకటయ్యాయి. సుమారు ఆరేళ్ల తర్వాత దక్షిణ కొరియాలోని బూసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ , చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు ముఖాముఖి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ కొరియా కేంద్రంగా బూసాన్‌లో జరిగిన వీరి సమావేశం సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. జిన్‌పింగ్‌తో తనకు మంచి సంబంధం ఉందంటూ పొకడ్తలు కురిపించారు. కాగా 2019లో జపాన్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఇరువురి నేతలు చివరి సారిగా భేటీ అయిన విషయం తెలిసిందే.

Read Also: Hurricane Melissa : కరీబియన్ దీవుల్లో మెలిస్సా తుఫాను విధ్వంసం .. 40 మంది మృతి!

Trump -Jinping

ఇరుదేశాల మధ్య సంబంధాల అభివృద్ధికి తాను సిద్ధం: జిన్‌పింగ్‌

‘నా స్నేహితుడు, చాలాకాలంగా చైనాకు అత్యంత విశిష్టమైన, గౌరవనీయమైన అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలవడం గౌరవంగా ఉంది. మేము ఇప్పటికే చాలా విషయాలు అంగీకరించాం. ఇప్పుడు మరికొన్నింటిని అంగీకరిస్తాం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఒక గొప్ప దేశానికి.. మంచి నాయకుడు. మా మధ్య అద్భుతమైన సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తామని నేను భావిస్తున్నా’ అంటూ ట్రంప్‌ పింగ్‌ పై ప్రశంసలు కురిపించాడు. అనంతరం జిన్‌పింగ్ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ట్రంప్‌ను కలవడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ప్రపంచ శాంతి కోసం ట్రంప్‌ శ్రద్ధ

ఇరుదేశాల మధ్య సంబంధాల అభివృద్ధికి ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తడం సహాజం అంటూ పింగ్‌ పేర్కొనడం గమనార్హం. అదే సమయంలో సంబంధాలు సరైన మార్గంలో ఉండాలని సూచించారు. ప్రపంచ శాంతి కోసం ట్రంప్‌ శ్రద్ధ వహిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలను ఆపేందుకు ట్రంప్‌ చేస్తున్న శాంతి ప్రయత్నాలను జిన్‌పింగ్‌ ప్రశంసించారు. ఇటీవల గాజా కాల్పుల విరమణకు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక కఠిన సమస్యలను ఎదుర్కొంటుందని తెలిపారు.

చైనాను చైనా అని ఎందుకు పిలుస్తారు?
"చైనా" అనే ఆంగ్ల పేరు సంస్కృత పదం సినా నుండి ఉద్భవించిందని నమ్ముతారు, ఇది చైనాను మొదట ఏకం చేసిన క్విన్ రాజవంశం (221–206 BCE) పేరు నుండి వచ్చింది.

అమెరికాలో ఎన్ని యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి?
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని 50 రాష్ట్రాలు ఏమిటి? తనిఖీ చేయండి...
50 రాష్ట్రాలు
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 50 రాష్ట్రాలు, ఒక సమాఖ్య జిల్లా మరియు 5 ప్రధాన భూభాగాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక గవర్నర్ ఉంటారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Diplomacy Donald Trump Latest News Breaking News Summit Telugu News US China relations Xi Jinping

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.