రష్యాతో యుద్ధం ముగింపు లక్ష్యంగా రూపొందిన శాంతి ఒప్పందంపై అమెరికాతో ప్రాథమిక అవగాహన కుదిరినట్లు ఉక్రెయిన్ తెలిపింది. అమెరికా ఉక్రెయిన్ అధికారులు జెనీవాలో చర్చలు జరిపిన అనంతరం అమెరికా ఉక్రెయిన్ కు అందజేసిన 28 అంశాల ప్రణాళిక ఆధారంగా ఈ ఒప్పందం రూపొందింది. ఇరువైపుల నుంచి వచ్చిన అదనపు సూచనలతో దీనిని మెరుగ్గా రూపొందించారు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. వచ్చేవారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను తన ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ను ఆదేశించాలని, అలాగే అమెరికా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కాల్ ఉక్రెయిన్ నేతలను కలవనున్నట్లు ఆయన చెప్పారు.
Read also : UPSC: వందేళ్లు పూర్తి చేసుకున్న ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’
ట్రంప్ తో చర్చలు సిద్ధం: జలెన్ స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్ స్కీ(zelensky) మంగళవారం మాట్లాడుతూ, ట్రంప్ తో సమావేశమై సున్నితమైన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ నెలాఖరులోపు సమావేశం జరగాలని ఆయన ప్రభుత్వం కోరుకుంటోంది. మున్ముందు కూడా అమెరికా వైపు నుంచి, ట్రంప్ నుంచి కూడా ఇలాగే సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నా. చాలా విషయాలు అమెరికాపైనే ఆధారపడి ఉన్నాయి.
ఎందుకంటే రష్యా అమెరికా బలానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది అని ఆయన అన్నారు. 28 అంశాల ప్రణాళికలోని కొన్ని నిబంధనలను తొలగించినట్లు జెలెన్స్కీ చెప్పారు. అయితే ట్రంప్ దీనిపై మాట్లాడుతూ ఇరుపక్షాలకూ ఎలాంటి గడువు తేదీ ఇవ్వలేదని, నాకైతే అది ముగిసే సమయమే తుదిగడువు అని అన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :