వెనెజులాలో భయాందోళనలను, దిగ్భ్రాంతికరమైన వాతావరణాన్ని సృష్టించిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)..ఇప్పుడు ఆ దేశ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో నిగమ్నమైనట్లు కనిపిస్తున్నది. శనివారం ఉదయం తన ‘మార్-ఏ-లాగో’ రిసార్ట్ లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో, వెనెజులా రాజధాని కారకస్ లో అర్ధరాత్రి అమెరికా దళాలు ఆపరేషన్ నిర్వహించి ఆ దేశ అధ్యక్షుడు నికలస్ మదురో, ఆయన భార్యను విజయవంతంగా ఆదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం విధితమే.
Read also: Venezuela: కస్టడీలో మదురో దంపతులు.. సిలియా ఫ్లోరెస్‌పై సంచలన ఆరోపణలు
వెనుజులా ప్రజలతో కలిసి పనిచేస్తాం: ట్రంప్
ఆతమ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్ సేత్ తో కూడిన బృందం వెనెజులా ప్రజలతో కలిసి పనిచేస్తుందని, సంక్షోభంలో ఉన్న ఆ దేశ నియంత్రణను చేపడుతుందని ట్రంప్ చెప్పారు. ‘సురక్షితమైన, సరైన, వివేకవంతమైన రీతిలో అధికార మార్పిడి జరిగే వరకు మేమే ఆ దేశాన్ని నడుతపుతాం’ అని ట్రంప్(Trump) పేర్కొన్నారు. అయితే, దేశాన్ని నడపడం, అంటే అసలు అర్ధం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, ఈ నిర్ణయం ట్రంప్ విధానంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును సూచిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ట్రంప్ తనను తాను ‘శాంతిస్థాపకుడిగా’గా
అభివర్ణించుకున్నారు. కానీ, గడచిన ఏడాది కాలంలో, ప్రపంచవ్యాప్తంగా సైనిక శక్తిని ఉపయోగించడానికి తాను సిద్ధమేనని ఆయన నిరూపించారు. గతవారమే ఆయన సిరియా, నైజీరియాలో వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు. 2025లో, ఇరాన్ లోని అణుకేంద్రాలు, కరీబియన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ అనుమానిత నైకలను, యెమెన్ లోని తిరుగుబాటు దళాలను, సోమాలియాలోని సాయుధ గ్రూపులను, ఇరాక్ లోని ఇస్లామిక్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నారు. తన లక్ష్యం వెనెజులాను తిరిగి గొప్పగా మార్చడం అని అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: