📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump: తైవాన్​ విషయంపై జిన్​పింగ్​కు ట్రంప్ వార్నింగ్​

Author Icon By Vanipushpa
Updated: November 3, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తైవాన్​పై దాడి చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చైనాకు తెలుసన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ (Trump). ముఖ్యంగా చైనా(China) అధ్యక్షుడు జిన్​పింగ్​కు ఈ విషయం బాగా అర్థం అవుతుందని చెప్పారు. జిన్​పింగ్​తో భేటీ జరిగిన వేళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్​పై దాడి చేస్తే తీసుకునే వ్యూహాత్మక ప్రణాళికను వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. దాడి చేస్తే ఏం జరుగుతుందో చైనాకు బాగా అర్థం అవుతుందని తెలిపారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా అధికారులు తైవాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకున్నారని డొనాల్డ్ ట్రంప్ వివరించారు.

Read Also: Rob Jetten: తొలి గే ప్రధానిగా చరిత్ర సృష్టించనున్న రాబ్ జెట్టెన్?

Trump-Jinping

నేను ఎలాంటి రహస్యాలు వెల్లడించట్లేదు: ట్రంప్

“ఒక వేళ తైవాన్​పై దాడి చేస్తే ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. దీనికి సమాధానం ఆయనకు అర్థమవుతుంది. ఇది భేటీలో ఎప్పుడూ ఒక అంశంగా రాలేదు. ఆయన ఎప్పుడూ దాని గురించి ప్రస్తావించలేదు. ఆయన దానిని ఎప్పుడూ ప్రస్తావించలేదని ప్రజలు కొంచెం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన దానిని బాగా అర్థం చేసుకున్నారు. నేను ఎలాంటి రహస్యాలు వెల్లడించట్లేదు. ఏదైనా జరిగితే ఏమి జరుగుతుందో మీకు కచ్చితంగా చెప్పే వారిలో నేను ఒకరిగా ఉండాలని అనుకోవట్లేదు.

ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న వేళ ఇరు దేశాల అధ్యక్షులు కలిశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా- పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సులో భాగంగా ఇరు దేశాధినేతలు సమావేశమయ్యారు. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలనే లక్ష్యంతో ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జిప్‌పింగ్‌తో కలిసి పనిచేస్తా: ట్రంప్

ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు జిప్‌పింగ్‌తో కలిసి పనిచేస్తానని ట్రంప్ చెప్పారు. జిన్‌పింగ్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందన్న ట్రంప్ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ట్రంప్‌ను కలిసినందుకు ఆనందంగా ఉందని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌‌ అన్నారు. ట్రంప్‌ మార్గదర్శకత్వంలో ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తడం అనేది సాధారణ విషయమేనన్నారు. అయితే, ఇరుదేశాల సంబంధాలు సరైన మార్గంలో ఉండాలని జిన్‌పింగ్‌ సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Geopolitics Latest News in Telugu Taiwan Telugu News online Telugu News Paper Telugu News Today US Diplomacy Xi Jinping

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.