📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump: హమాస్ రక్తపాతంపై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

Author Icon By Vanipushpa
Updated: October 17, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్(Israel) హమాస్‌(Hamas) ల మధ్య గాజా శాంతి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరువైపులా బందీలు విడుదల అయ్యారు. కాల్పుల విరమణకు అంగీకరించారు. అలాగే ఇజ్రాయెల్ సైన్యం గాజాను వదిలిపెట్టడానికి ఒప్పుకుంది. ఇదంతా జరిగి వారం రోజులు అవ్వలేదు…గాజాలో హమాస్ రక్తపాతం మొదలెట్టింది. కాల్పుల విరమణ తర్వాత హమాస్ ప్రత్యర్థి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ అందరినీ చంపేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 50 మంది దాకా హతమార్చింది. హమాస్ గాజాలో హింసాత్మకంగా ప్రవర్తిస్తోంది.

Johnson’s Company:జాన్సన్ కంపెనీ బేబీ పౌడర్‌ సంస్థపై కోట్లకు దావా

గాజాలో పాలస్తీనియన్ల ఊచకొత

ఇజ్రాయెల్ గూఢచారులనే అనుమానంతో గాజాలో పాలస్తీనియన్లను ఊచకొత కోస్తోంది. శాంతి ఒప్పందం తర్వాత హమాస్ ఇప్పటి వరకు 50మంది చంపింది. ఇజ్రాయెల్‌తో కుమ్మక్కయ్యారనే అనుమానంతో ఆ బృందం డజన్ల కొద్దీ ప్రత్యర్థి మిలీషియా సభ్యులను కాల్చి చంపింది. గాజా అంతర్గత భద్రతను హమాస్ చేపట్టవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald trump) ప్రకటించిన కొద్దిసేపటికే ఇది జరగడం గమనార్హం.

Trump On Hamas: హమాస్ రక్తపాతంపై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

హమాస్‌ను చంపడం తప్ప వేరే మార్గం లేదు: ట్రంప్

దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. హమాస్ సృష్టిస్తున్న మారణహోమం మీద వచ్చిన నివేదికలను చూశానని…అంతర్గత రక్తపాతం ఆపకపోతే వారిని చంపడానికి వేరే మార్గం ఉండదని హెచ్చరించారు. మాకు లోపలికి వెళ్ళ హమాస్‌ను చంపడం తప్ప వేరే మార్గం లేదని ట్రంప్ అన్నారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేయడం చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్గత హింస గురించి తాము తక్కువ అంచనా వేశామని…ఇప్పుడు వారు మేము అనుకున్న దానికంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ అన్నారు.

గాజాలో శాంతి ఒప్పందం అమలుపై పర్యవేక్షణ

ప్రస్తుతం గాజాలో హమాస్ చెడ్డ ముఠాలను మాత్రమే తుడిచిపెట్టిందని తెలుస్తోందని..అంతకు వరకూ తనకు సమస్య లేదని..కానీ దానిని మించి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పారు. వారు త్వరలోనే నిరాయుధులు అవుతారు. అలా చేయకపోతే మేము వారిని బలవంతంగా నిరాయుధులను చేస్తామని. తర్వాత అది బహిరంగ హింసగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రంప్ అన్నారు. మరోవైపు గాజాలో శాంతి ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి అమెరికాతో పాటూ భాగస్వామి దేశాలు తమ బృందాలను అక్కడకు పంపిస్తున్నారు. అమెరికా నుంచి 200 మంది సైనికులు ఇజ్రాయెల్ కు వెళుతున్నారు. అయితే వీరు గాజాలో మాత్రం అడుగు పెట్టరని వైట్ హౌస్ చెబుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Donald Trump Gaza violence Hamas Israel-Palestine Latest News Breaking News middle east conflict Telugu News Terrorism Trump statement US Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.