Donald Trump Warning to Iran: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ తన పొరుగు దేశాలు మరియు అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
Read Also: Missile Attack on AliKhamenei: ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం
ఇళ్లకే పరిమితం కావాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, బయట భయానక వాతావరణం ఉందని ట్రంప్ హెచ్చరించారు. “మేము ఎవరినీ అనవసరంగా టార్గెట్ చేయము. కానీ మా జోలికి వచ్చిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆకాశం నుంచి బాంబుల వర్షం కురుస్తున్న తరుణంలో ప్రజల క్షేమం కోసమే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపారు.
Donald Trump Warning to Iran: అరబ్ దేశాలపై దాడులు
ఇరాన్ తన సొంత పొరుగు దేశాలైన అరబ్ దేశాలపై దాడులు చేయడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఇరాన్ వారసత్వ ప్రణాళిక (Succession Plan) గురించి మాకు స్పష్టత లేదు. కానీ వారు అరబ్ దేశాలను లక్ష్యంగా చేసుకోవడం ఊహించని పరిణామం” అని ఆయన పేర్కొన్నారు.
ముందుకు వస్తున్న గల్ఫ్ దేశాలు
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇన్నాళ్లూ సంయమనం పాటించిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇరాన్‌పై ఎదురుదాడి చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ పరిణామం తమను చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ దుందుడుకు చర్యల వల్ల గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలో భాగం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఇరాన్లో వందలాది వ్యూహాత్మక లక్ష్యాలను అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే ధ్వంసం చేశాయి. అమీర్ వంటి సైనిక ఉన్నతాధికారులు మరణించడంతో ఇరాన్ నాయకత్వం పూర్తిగా అయోమయంలో ఉన్నట్లు సమాచారం.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: