ప్రపంచంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, మస్క్‌తో తన రాజకీయ బంధం ముగిసినట్టేనని స్పష్టం చేశారు. మస్క్ ఇకపై డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేస్తే చూస్తూ ఊరుకోబోనని, దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర
2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మస్క్ మద్దతుతో పాటు సోషల్ మీడియాలో ట్రంప్‌కు అనుకూల వాతావరణం కల్పించడంలో టెస్లా అధినేత భాగస్వామ్యం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’పై మస్క్ విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తోంది.
ట్రంప్ మస్క్‌కు పాలిటికల్ వార్నింగ్
ట్రంప్ తీసుకువచ్చిన ఆ చట్టం వ్యాపార వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. దీనికి స్పందనగా ట్రంప్ కూడా మస్క్‌కు పాలిటికల్ వార్నింగ్ ఇచ్చారు. మస్క్ మద్దతు లేకుండానే తనకు విజయమంటూ ధీమా వ్యక్తం చేసిన ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరి మధ్య బంధం పూర్తిగా విరిగిపోయిందా? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ పరిశీలకుల ముందు నిలిచింది.
Read Also : Rahul Gandhi : ఈసీపై నిప్పులు చెరిగిన రాహుల్