📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump: వెస్ట్ బ్యాంక్‌ విషయంలో ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: October 25, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆక్రమిత భూభాగంపై సార్వభౌమాధికారానికి మార్గం సుగమం చేస్తూ జెరూసలేంలోని శాసనసభ్యులు రెండు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వెస్ట్ బ్యాంక్‌(West Bank)ను స్వాధీనం చేసుకోవడంలో ఇజ్రాయెల్ ముందుకు సాగితే వాషింగ్టన్ నుండి అన్ని మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) హెచ్చరించారు. టైమ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఒకవేళ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే… ఆదేశం అమెరికా మద్దతును పూర్తిగా కోల్పోతుందని అన్నారు.

Read Also: Visa: కొత్త విధానంలో వీసా మార్పులతో స్వాగతం పలుకుతున్న కెనడా

Netanyahu

ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం, ఇరాన్‌ అణు కార్యక్రమాలు సమస్య

ఇప్పుడు అలా చేయలేరు. మనకు ఇప్పుడు అరబ్‌ దేశాలు చాలా మద్దతు ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇజ్రాయెల్‌-అరబ్‌ దేశాల మధ్య సంబంధాలపై మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి అబ్రహం ఒప్పందంలో సౌదీ అరేబియా కూడా చేరుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో వారికి ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం, ఇరాన్‌ అణు కార్యక్రమాలు సమస్యగా ఉండేవని, ఇప్పుడు ఆ రెండు ఇబ్బందులూ లేవన్నారు.

తెలివి తక్కువ రాజకీయ స్టంట్: వాన్స్

మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా దీన్ని ఖండించారు. నేను వ్యక్తిగతంగా దానిని కొంత అవమానంగా భావిస్తున్నాను” అని వాన్స్ అన్నారు. “ట్రంప్ పరిపాలన విధానం ఏమిటంటే వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్‌లో విలీనం చేయకూడదని చెప్పారు. ఇది కనుక రాజకీయ స్టంట్ అయితే ఇంత కంటే తెలివి తక్కువ రాజకీయ స్టంట్ ఉండదని వాన్స్ అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో వెస్ట్ బ్యాంక్‌లోని అన్ని స్థావరాలను పూర్తిగా విలీనం చేయాలని ప్రతిపాదించే బిల్లు, పెద్ద స్థావర నగరమైన మాలే అడుమిమ్‌కు సార్వభౌమత్వాన్ని వర్తింపజేసే బిల్లులపై ఇజరాయెల్ పార్లమెంట్‌లో స్వల్ప తేడాతో ఆమోదించబడ్డాయి.

వెస్ట్ బ్యాంక్ దేనికి ప్రసిద్ధి చెందింది?
ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణకు వెస్ట్ బ్యాంక్ కేంద్రంగా ఉంది. పాలస్తీనియన్లు గాజా స్ట్రిప్‌తో పాటు దీనిని తమ ఊహించిన రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తారు. మితవాద మరియు సైద్ధాంతిక ఇజ్రాయెల్‌లు దీనిని తమ పూర్వీకుల మాతృభూమిగా చూస్తారు, అనేక బైబిల్ ప్రదేశాలు ఉన్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Donald Trump statement israel Israel–Palestine issue Latest News Breaking News Middle East Politics Telugu News Trump Warning US foreign policy West Bank conflict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.