📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

US: డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

Author Icon By Vanipushpa
Updated: January 14, 2026 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్రీన్‌లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మండిపడ్డారు. అమెరికా కంటే డెన్మార్క్‌లో ఉండటానికే తాము ప్రాధాన్యమిస్తామంటూ గ్రీన్‌లాండ్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ ఫైర్ అయ్యారు. అలా మాట్లాడినందుకు జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్‌‌కు పెద్ద సమస్య ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు. గ్రీన్‌లాండ్ ప్రధాని వైఖరితో తాను ఏకీభవించడం లేదన్నారు. జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్‌‌తో తనకు పరిచయమేదీ లేదని ట్రంప్ తెలిపారు. గ్రీన్‌లాండ్ ప్రధాని గురించి తనకేమీ తెలియదన్నారు. కానీ గ్రీన్‌లాండ్‌పై తీసుకున్న వైఖరే ఆయనకు పెద్ద సమస్యను తెచ్చి పెడుతుందని అమెరికా ప్రెసిడెంట్ వార్నింగ్ ఇచ్చారు. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Artificial Intelligence: ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

US: డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్‌‌ను, నాటోను, ఈయూను ఎంచుకుంటాం

ఇటీవలే దేశ రాజధాని కోపెన్‌హగెన్ వేదికగా డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్‌, గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్‌ సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్ ఎప్పటికీ డెన్మార్క్‌లోనే ఉండటానికి మొగ్గు చూపుతుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుత సంక్షోభ తరుణంలో గ్రీన్‌లాండ్ ఎదుట అమెరికా, డెన్మార్క్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయని, తాము డెన్మార్క్‌‌ను, నాటోను, యూరోపియన్ యూనియన్(ఈయూ)ను ఎంచుకుంటామని స్పష్టం చేశారు. నేడు, రేపు, ఇప్పటికీ, ఎప్పటికీ ఇదే తమ వైఖరి అని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్‌ పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్ భవితవ్యాన్ని ఇతర దేశాలు డిసైడ్ చేయలేవని, దాన్ని అక్కడి ప్రజలే తేలుస్తారన్నారు.

నేడు అమెరికా – డెన్మార్క్ కీలక భేటీ

ఈనేపథ్యంలో బుధవారం (జనవరి 14న) వైట్ హౌస్ వేదికగా డెన్మార్క్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రులు లార్స్ లొకే రస్‌మ్యూసెన్, వివియన్ మోట్జ్ ఫెల్ట్‌లతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ కానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్ కొనుగోలుకు అమెరికా ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి గురించి ఈసందర్భంగా జేడీ వాన్స్, రూబియో వివరించే అవకాశం ఉంది. చైనా, రష్యాల సైనిక ముప్పు నుంచి డెన్మార్క్‌ను కాపాడేందుకు గ్రీన్‌లాండ్‌ను అమెరికా సైన్యానికి అప్పగించాలని వారు కోరే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Arctic geopolitics Denmark Greenland relations donald trump warning Greenland Prime Minister International Politics Telugu News online Telugu News Today US Greenland interest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.