📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Trump-డెమోక్రటిక్ నేత ఇల్హాన్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

Author Icon By Sushmitha
Updated: September 19, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వలసవాదులపై ట్రంప్(Trump) వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు మామూలైంది. సమయం దొరికినప్పుడల్లా వారిపై నోరు పారేసుకుంటుంటారు. తాజాగా ఓ మహిళా నేతపై ఇదే వ్యాఖ్యల్ని చేశారు. సోమాలీలో పుట్టి అమెరికాలో ఉంటున్న డెమోక్రటిక్ యూఎస్ కాంగ్రెస్ మహిళా నేత ఇల్హాన్ ఒమర్ పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా పౌరసత్వం పొందడానికి ఆమె తన సోదరుడిని వివాహం చేసుకుంది. ఇప్పుడేమో ఇల్హాన్ ఏకంగా నాకు అమెరికాను ఎలా నడపాలో చెబుతోంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ముదురుతున్న.

 ట్రంప్ డెమోక్రటిక్ నేతల మధ్య వివాదాలు

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రిపబ్లికన్ నేతలకు డెమోక్రటిక్(Democratic) నేతల మధ్య గత కొన్నిరోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్నది. అక్రమవలసలు, పలు దేశాలపై ఎంట్రీ నిషేధం, శరణార్థుల కార్యక్రమాలను నిలిపేయడం వంటివి అందులో ముఖ్యమైనవి. వీటిపై ఇల్హాన్ ఒమర్ మొదటి నుంచీ వ్యతిరేక స్వరం వినిపిస్తూ వస్తున్నారు. దాంతో పాటూ ఆమె ట్రంప్ ను యూదు వ్యతిరేకి అంటూ ముద్ర వేశారు. దీనిపై ట్రంప్ తీవ్రంగా ఖండించారు. సోమాలీ మూలాలు కలిగిన ఇల్హాన్(Ilhan) తనకు చెప్పడం ఏంటని పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైనే ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. వీరి వివాదం 2019కు ముందు నుంచీ నడుస్తోంది. అంటే ట్రంప్ మొదటి టర్మ్ నుంచీ ఇల్హాన్ ఒమర్ ను అమెరికా విడిచి సోమాలియా వెళ్లిపోవాలని అన్నారు. అదే వ్యాఖ్యల్ని ట్రంప్ మరోసారి చేశారు.

చార్లీ కిర్పై ఇల్హాన్ అనుచిత వ్యాఖ్యలు

ఇటీవల హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్పై ఇల్హాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతనొక సంప్రదాయ వ్యక్తని అతనికి నివాళులర్పించడంలో అర్థం లేదని అన్నారు. కిర్క్ ఒక ద్వేషపూరిత వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాదు నీచమైన వ్యక్తి చరిత్రను తిరిగి రాయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఇల్హాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వద్ద మూర్ఖులు ఉన్నారంటే ఇల్హాన్ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలే ట్రంప్ కు కోపం తెప్పించాయి. ఎన్నికల్లో ఓడిపోయిన మహిళ నాకు పాఠాలు నేర్పించడానికి వచ్చిందంటూ తిరిగి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్హాన్ ఒమర్ సోమాలియ శరణార్థి, 1995లో అమెరికాకు వచ్చి ఐదు సంవత్సరాలు శరణార్థిగా నివసించారు. 2000లో ఇల్హాన్ అమెరికా పైరసత్వం పొందింది. ఈమె 2019 నుంచి మిన్నెసోటాలోని 5వ కాంగ్రెస్ జిల్లాకు అమెరికా ప్రతినిధిగా పనిచేస్తున్న ఒక అమెరికన్ రాజకీయ నాయకురాలు. అంతేకాక ఆమె డెమోక్రటిక్ పార్టీకి చెందిన మహిళ,

డొనాల్డ్ ట్రంప్ ఇల్హాన్ ఒమర్‌పై చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటి?

అమెరికా పౌరసత్వం పొందడానికి ఆమె తన సోదరుడిని వివాహం చేసుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

ఈ వివాదంలో ఇల్హాన్ ఒమర్ ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలు ఏమిటి?

ఇల్హాన్ ఒమర్ ట్రంప్‌ను ‘యూదు వ్యతిరేకి’ అని ముద్ర వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dussehra-holidays-from-22nd-of-this-month-lokesh/breaking-news/550290/

Democratic Party Donald Trump Google News in Telugu Ilhan Omar Immigration Republican Party Telugu News Today Truth Social. US Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.