📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

 Telugu News: Trump: అణ్వాయుధాలతో ప్రపంచాన్ని మరోసారి హెచ్చరించిన ట్రంప్

Author Icon By Sushmitha
Updated: November 7, 2025 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) నిత్యం ఏదో ఒక ప్రకటనతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు పదేపదే చెప్పుకుంటున్న ట్రంప్ మరోసారి ప్రపంచదేశాలను హెచ్చరిస్తున్నారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150సార్లు పేల్చేయొచ్చని వార్నింగ్ ఇచ్చారు. అణునిరాయుధీకరణ గొప్ప విషయమని, ఆ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్ తో చర్చించినట్లు వెల్లడించారు. ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్ లో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు.

Read Also: CM Revanth Reddy: మంత్రులపై గులాబీ షాక్‌.. కేబినెట్‌లో పెద్ద మార్పులు త్వరలో!

Trump

అణ్వాయుధాలపై డబ్బు ఖర్చు వద్దు: ట్రంప్

ప్రతి ఒక్కరూ డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ఇతర విషయాలు ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిపై ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తగా శాంతి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానిని సాధించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం అవి లేవు అని ట్రంప్ పేర్కొన్నారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్టు ఇటీవల ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్రరాజ్యాధినేత సంచలన వ్యాక్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు.

 ఈ జాబితాలో పాకిస్తాన్(Pakistan) కూడా ఉందని పేర్కొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ట్రంప్ యుద్ధాలను కాకుండా శాంతినే కోరుతున్నారు. అందుకే ఆయన రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల నివారణకు తనవంతు చాలాకృషి చేశారు.ట్రంప్ వల్లే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందాలకు రాగల్గారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Donald Trump Geopolitical warning Global Security Google News in Telugu Latest News in Telugu Nuclear Threat Telugu News Today US foreign policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.