అమెరికా (America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండవసారి ఎంపికైన తర్వాత కొన్నివిషయాల్లో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా ఆయన బీబీసీపై తనదైన శైలిలో షాక్ ఇచ్చారు. ఆ వార్తాసంస్థకు ఊహించని దెబ్బకొట్టేందుకు యత్నిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ వార్తాసంస్థ బీబీసీకి (BBC) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఊహించని షాక్ తగిలింది.
Read Also: Australia: దాడికి పాల్పడింది తండ్రీ కొడుకులే: తేల్చిన పోలీసులు
2021లో క్యాపిటల్ హిల్ పై దాడి జరిగిన సందర్భంలో తాను చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చి ప్రసారం చేసిందంటూ ట్రంప్ బీబీసీపై భారీ పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదంపై ఆయన ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 బిలియన్ డాలర్లు (రూ. 90,000 కోట్లు) నష్టపరిహారం డిమాండ్ చేశారు.
తన ప్రసంగాన్ని రెచ్చగొట్టేలా మార్చింది: ట్రంప్
ట్రంప్ తరపు న్యాయవాదులు మియామిలోని ఫెడరల్ కోర్టులో 46 పేజీల దావాను దాఖలు చేశారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ పై తన మద్దతుదారులు దాడికి ముందు ట్రంప్ సుమారు గంటపాటు ప్రసంగించారు.అయితే బీబీసీ తన ‘పనోరమ’ డాక్యుమెంటరీలో ఈ ప్రసంగాన్ని రెండుచోట్ల ఉద్దేశపూర్వకంగా సవరించినట్లు ట్రంప్ ఆరోపించారు. తాను శాంతియుత నిరసనలకు మాత్రమే పిలుపును ఇచ్చానని..
కానీ బీబీసీ తన ప్రసంగాన్ని ఉద్వేగభరితంగా, రెచ్చగొట్టేవిధంగా మార్చిందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసిన అంశంలో తమ సంస్థతో పాటు తాను కూడా క్షమాపణలు చెబుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తాము ఎడిట్ చేసిన ట్రంప్ ప్రసంగం తప్పుదోవ పట్టించేరీతిలో ఉన్నట్లు అంగీకరించారు. అయినా కూడా ట్రంప్ క్షమించేందుకు బదులుగా పరువునష్టం దావా వేయడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: