Trump: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత్-పాక్ మధ్య మే నెలలో తలెత్తిన ఘర్షణ సమయంలో యుద్ధం జరిగే పరిస్థితిని ట్రంప్ సమయోచితంగా నివారించారని ఆయన అన్నారు. బాకులో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో మాట్లాడుతూ, “ట్రంప్ ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోకపోతే, ఆ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి” అని షెహబాజ్ పేర్కొన్నారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన గుర్తు చేశారు.
Read also: Mumbai: “ముంబై”ఆసియాలో నంబర్ వన్ నగరం
Trump: ట్రంప్ వల్లే యుద్ధం ఆగింది: షెహబాజ్ షరీఫ్
కశ్మీర్ వంటి ప్రాంతాలకు
Trump: అదే సందర్భంలో షెహబాజ్ కశ్మీర్ సమస్యను కూడా ప్రస్తావించారు. అజర్‌బైజాన్ కరబాఖ్‌లో సాధించిన విజయం కశ్మీర్ వంటి ప్రాంతాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. “పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోంది, కానీ దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీ పడదు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అజర్‌బైజాన్, పాకిస్థాన్, తుర్కియే సైనికులు పాల్గొన్నారు. జేఎఫ్-17 థండర్ జెట్ల ప్రదర్శనతో పరేడ్ ముగిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: